Mission Bhagiratha : మిషన్ భగీరథ పథకంలో అవకతవకలపై తెలంగాణ సర్కార్ ఫోకస్..!

మిషన్ భగీరథ( Mission Bhagiratha ) పథకంలో చోటు చేసుకున్న అవకతవకలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక దృష్టి సారించింది.ఈ మేరకు మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం అయ్యారు.

అయితే రూ.42 వేల కోట్లతో గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టగా.ఆగస్ట్ 7, 2016 న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రధాని మోదీ( Narendra Modi ) ఈ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.కాగా ఈ పథకంలో సుమారు రూ.6 వేల నుంచి రూ.7 వేల కోట్ల అవకతవకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఇంట్రా విలేజీ వర్క్స్ లో గోల్ మాల్ జరిగిందని అలాగే నల్లాలు, పైపు లైన్లు వేయకుండానే బిల్లులు తీసుకున్నారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మెటీరియల్ కొనుగోలు వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని, కొన్న మెటీరియల్ వాడకుండా పక్కన పడేసినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అవకతవకలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రభుత్వం ప్రతి మండలంలోని ఒక గ్రామంలో విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players