గత కొంతకాలంగా మెగా కుటుంబం అల్లు కుటుంబాల మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇలా విభేదాల కారణంగా ఈ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.
కానీ ఇటీవల అల్లు అర్జున్( Allu Arjun ) అరెస్ట్ కావడంతో ఈ రెండు కుటుంబాల మధ్య దూరం కూడా తగ్గిపోయిందని తెలుస్తుంది.పుష్ప 2( Pushpa 2 ) సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అభిమాని మరణించడంతో అందుకు పరోక్షంగా అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు గత శుక్రవారం ఈయనని అరెస్టు చేశారు.
ఈ విధంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఒక్కసారిగా విశ్వంభర సినిమా షూటింగ్ పనులను కూడా పక్కనపెట్టి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి బయలుదేరారు.
అప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్( Allu Arjun Arrest ) కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.ఇక చిరంజీవి కూడా అక్కడికి వెళ్తే బందోబస్తు నిర్వహించడం ఇబ్బంది అవుతుందని పోలీసులు చెప్పడంతో చిరంజీవి నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లే అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడటమే కాకుండా స్నేహ రెడ్డికి ధైర్యం చెప్పారు.ఇక నాగబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇలా అల్లు అర్జున్ తిరిగి బెయిల్ మీద బయటకు రావడంతో మరుసటి రోజు నాగబాబు( Nagababu ), చిరంజీవి ఇంటికి వెళ్లి మరి వారితో మాట్లాడి వచ్చేసారు.
ఈ విధంగా ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయింది అని తెలుస్తుంది.ఇకపోతే వచ్చే సంక్రాంతి( Sankranthi ) పండుగను మెగా కుటుంబ సభ్యులందరూ కూడా బెంగళూరులోని ఫామ్ హౌస్ లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు ప్రతి ఏడాది ఈ మూడు రోజులపాటు ఈ రెండు కుటుంబ సభ్యులు అందరూ ఒకే చోటే కలుస్తూ ఉంటారు.మరి ఈ ఏడాది కూడా సంక్రాంతి వేడుకలు జరుగుతాయనే తెలుస్తుంది.
అయితే ఈ సంక్రాంతి వేడుకలలో అల్లు అర్జున్ పాల్గొంటారా అనేది సందేహంగా మారింది.ఈ రెండు కుటుంబాల మధ్య దూరం తగ్గడంతో తప్పనిసరిగా అల్లు అర్జున్ వెళతారు.
కానీ ఈయనపై కేసు ఉన్న నేపథ్యంలో సిటీ దాటి వెళ్లడానికి అనుమతి లేదు అలాంటిది బెంగళూరు వెళ్లడానికి పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అన్నది సందేహంగా మారింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy