టీడీపీ కీలక నేత చింతమనేని ప్రభాకర్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపులు..!!

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు లో పటాన్ చెరు ప్రాంతాలలో చింతమనేని మరికొంతమంది కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు.

పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం రాత్రి దాడులు చేయడం జరిగింది.ఇంతలో పోలీసుల రాక తెలుసుకొని అక్కడనుండి చింతమనేని పరారైనట్లు సమాచారం.

దీంతో ఆయనను పట్టుకోడానికి తెలంగాణ పోలీసులు గాలింపులు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలో కోడి పందాలు జరిగే ప్రాంతాలలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్టు.100 కోళ్లను, 10 లక్షల రూపాయల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగిందట.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక చింతమనేని పై చాలా కేసు నమోదు అయ్యాయి.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చింతమనేని అరెస్టు కావడం జైలుకు కూడా వెళ్లడం తెలిసిందే.అయితే తాజాగా చింతమనేని ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రంలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని ఆయనను పట్టుకోవడానికి తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగినట్లు వార్తలు రావడం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Advertisement
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

తాజా వార్తలు