అన్ని రంగాల్లోనూ తెలంగాణ మార్క్..: మంత్రి హరీశ్ రావు

తెలంగాణ అభివృద్ధితో ఏ రాష్ట్రం కూడా పోటీ పడలేదని మంత్రి హరీశ్ రావు అన్నారు.

తాము ఉద్యమంలో రాజీపడలేదన్న ఆయన రాష్ట్ర అభివృద్ధిలోనూ రాజీ పడలేదని తెలిపారు.

అన్ని రంగాల్లోనూ తెలంగాణకు అవార్డులు వచ్చాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.మ్యానిఫెస్టోలో చెప్పిన వాటిలో 90 శాతం అమలు చేశామన్నారు.

అలాగే మ్యానిఫెస్టోలో పెట్టని ఎన్నో పథకాలు కూడా ప్రవేశ పెట్టామని చెప్పారు.బీఆర్ఎస్ పాలనలో పల్లెలు, పట్టణాల్లో సమగ్ర అభివృద్ధి సాధించిందని తెలిపారు.

అన్ని రంగాల్లో తెలంగాణ మార్క్ కనిపిస్తోందన్న మంత్రి హరీశ్ రావు రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide