కరోనా కారణంగా తెలంగాణ గత సెషన్ అసెంబ్లీ సమావేశాలు మధ్యలోనే ముగిశాయి.తెలంగాణ అసెంబ్లీ నేడు ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది.
ఈ రోజు ఉదయం 11:30 గంటలకు శాసనసభ ప్రారంభం అవుతుంది.నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులకు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
నాలా చట్టానికి సవరణ, రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణలు, జీహెచ్ఎంసీ చట్టం - 1955, సవరణ బిల్లులపై చర్చించి అసెంబ్లీ ఆమోదం తెలపనుంది.కరోనా మహమ్మారి కారణంగా అసెంబ్లీలో కరోనా నియమాలని పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ సమావేశంలో జీహెచ్ ఎంసీ సహా 4 చట్టసవరణ ముసాయిదా బిల్లులపై చర్చ జరుగనుంది.అలాగే వ్యవసాయ భూమి ఇతర అవసరాలకు వినియోగం, సీఆర్పీసీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టాలకు సంబంధించిన సవరణ బిల్లులపైనా చర్చ చేపట్టనున్నారు.
ఎలాంటి ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా బిల్లులపై చర్చ జరుగనుంది.ఈ రోజు శాసనసభ, బుధవారం మండలి సమావేశం కానున్నాయి.దీనికి తగ్గట్టుగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కౌన్సిల్ చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అందుకనుగుణంగా సీటింగ్‌ను ఏర్పాటు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి సూచించారు.కరోనా దృష్ట్యా గతంలో సభలో సభ్యుల మధ్య భౌతికదూరం ఉండే విధంగా అమర్చిన సీటింగ్ విధానాన్ని కొనసాగించాలని సూచించారు.
అసెంబ్లీ ప్రాంగణం, సభ లోపల పూర్థిస్థాయిలో శానిటైజేషన్ చేయించాలని మండలి కార్యదర్శిని ఆదేశించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy