నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ వ్యవహరిస్తోంది..: ఏపీ సీఎస్

కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో ఏపీ సీఎస్ పాల్గొన్నారు.ఈ క్రమంలో నాగార్జునసాగర్ దగ్గర పరిస్థితులను సీఎస్ జవహర్ రెడ్డి వివరించారు.

విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఎస్ జవహర్ రెడ్డి అన్నారు.ఏపీకి తాగునీరు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని తెలిపారు.

ఈనెల 6న జరగబోయే సమావేశంలో అన్ని విషయాలను చెబుతామని స్పష్టం చేశారు.కాగా ఈనెల 6వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల సీఎస్ లతో పాటు ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు