భద్రాచలంలో గిరిజనులతో తెలంగాణ గవర్నర్ ముఖాముఖి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటన కొనసాగుతోంది.

ఇందులో భాగంగా ఆమె భద్రాచలం శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం గిరిజనులతో గవర్నర్ తమిళిసై ముఖాముఖి నిర్వహించారు.వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలోనే ఏపీలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని గిరిజనులు కోరారని ఆమె తెలిపారు.కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని గవర్నర్ తమిళిసై వెల్లడించారు.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement