బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు బీఆర్ఎస్( BRS ) ఆధ్వర్యంలో జరగనున్నాయి.ప్రభుత్వ కార్యక్రమాలకు కౌంటర్ గా బీఆర్ఎస్ కార్యక్రమాలను రూపకల్పన చేయనుందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ యోచనలో ఉంది.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం( Telangana Formation Day ) జూన్ 2 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనుందని సమాచారం.

ఈ క్రమంలోనే తెలంగాణ కోసం చేసిన పోరాటంతో పాటు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ యోచిస్తోంది.ఇందుకోసం నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో దశాబ్ది వేడుకలను నిర్వహించనుంది.

ఈ క్రమంలోనే పార్టీ నేతలు, క్యాడర్ ను వేడుకల్లో భాగస్వామ్యం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

Advertisement
ఈ డ్రింక్స్ తీసుకుంటే..మీ లంగ్స్ క్లీన్ అవ్వ‌డం ఖాయం!

తాజా వార్తలు