టి. కాంగ్రెస్ లో కొత్త కమిటీలు ... వారికే ఛాన్స్ 

తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) దూకుడు చూపిస్తోంది.

ఒకపక్క కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వంలో తనదైన ముద్ర వేసేందుకు రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రయత్నిస్తుండగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది.

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను( Mahesh Kumar Goud ) నియమించింది.రేవంత్ సన్నిహితుడైన మహేష్ కుమార్ ను నియమించడం వెనుక కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగానే వ్యవహరించింది.

ఇక పార్టీలో ఇతర కీలక పదవులను భర్తీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది.ఈ మేరకు కొత్త కమిటీల ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

వైస్ ప్రెసిడెంట్ లు,  వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు,  జనరల్ సెక్రటరీలు,  జాయింట్ సెక్రటరీలు , ఆఫీస్ బేరర్లు , ఆర్గనైజేషన్ మెంబర్లు , పార్టీ ఫ్రెంటల్ ఆర్గనైజేషన్స్ తదితర పదవులను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది .రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయిలో కమిటీలు అన్నిటిని ఏర్పాటు చేయనున్నారు .కొత్త పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలోనే పార్టీకి సంబంధించిన పదవులు అన్నిటిని భర్తీ చేయనున్నారు.

Advertisement

త్వరలోనే దరఖాస్తులు స్వీకరణ మొదలుపెట్టనున్నట్లు సమాచారం.అయితే ఈ దరఖాస్తులు మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ,  క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పార్టీ పదవులకు గట్టి పోటీనే ఉంటుందనే అంచనాలో ఉన్నారు.

ఇప్పటి వరకు పిసిసి కార్యవర్గంలో వివిధ హోదాల్లో పనిచేసిన కొంతమంది నేతలను కొత్త కమిటీల్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.కాంగ్రెస్ లో పదవుల భర్తీ మొదలు పెడుతున్నారనే సమాచారంతో అప్పుడే పైరవీలు మొదలయ్యాయి.

తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు రాష్ట్రస్థాయి నాయకులు ఒత్తిళ్లు మొదలుపెట్టారు.  రాష్ట్రస్థాయి పదవుల నుంచి జిల్లా స్థాయి పదవుల వరకు తీవ్ర పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది.

అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల టికెట్లకు దరఖాస్తు చేసినట్లే పార్టీ పదవుల కోసమూ దరఖాస్తులను స్వీకరించనున్నారు  వచ్చిన దరఖాస్తుల జాబితాలను ఏఐసిసికి( AICC ) పంపించి అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.అభ్యర్థుల జాబితాను ఏఐసీసీకి పంపించడం ద్వారా రాష్ట్రంలోని మంత్రులు ఇతర ముఖ్య నాయకులు మధ్య భేదాభిప్రాయాలు ఉండవని రాష్ట్ర నాయకత్వం భావిస్తోందట.

కెనడా : భారత సంతతి యువతి మరణంపై ముగిసిన దర్యాప్తు.. ఏం తేల్చారంటే?
Advertisement

తాజా వార్తలు