ఊరుకోండమ్మా ! ఆ నేతలను బుజ్జగిస్తున్న అధిష్టానం !

కాంగ్రెస్ పార్టీ లో టికెట్ల కుంపటి రాజుకుని భగ భగ మండుతూనే ఉంది.

ఆ మంటలను ఆర్పేందుకు అధిష్టానం రంగంలోకి దిగడమే కాదు నీయెళ్లు చల్లి ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది.

లేకపోతే ఎన్నికల నాటికి అది కోలుకోలేని దెబ్బ తీస్తుందని అధిష్టానం భావిస్తోంది.అందుకే అటువంటి నేతలను బుజ్జగించేందుకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో కాంగ్రెస్‌ బుజ్జగింపుల కమిటీ సమావేశం నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా.మహాకూటమిలో పొత్తులలో భాగంగా పార్టీని నమ్ముకుని పనిచేసిన వారిని పక్కన పెట్టొద్దని వారి వద్ద పార్టీ అసంతృప్తులు .రెబెల్స్ ఆవేదన వ్యక్తం చేశారు.వరంగల్‌ వెస్ట్‌ టిక్కెట్‌ ఆశిస్తున్న డీసీసీ ప్రెసిడెంట్‌ నాయిని రాజేందర్‌రెడ్డి తనకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

రాజేంద్రనగర్‌ టిక్కెట్‌ ఆశించి పార్టీకి రాజీనామా చేసిన సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక రెడ్డి కూడా బుజ్జగింపుల కమిటీ ముందు హాజరయ్యారు.రాజేంద్రనగర్‌ను టీడీపీకి ఎలా ఇస్తారని కమిటీ సభ్యులను ప్రశ్నించినట్లు తెలుస్తుంది.

Advertisement

దుబ్బాకకు చెందిన చిందం రాజ్ కుమార్, ఇబ్రహీంపట్నానికి చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డి భేటి అయ్యారు.కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తో పాటు ఏఐసీసీ కార్యదర్శులు సలీమ్, శ్రీనివాస కృష్ణన్ లు బుజ్జగింపుల కమిటీని కలిశారు.

Advertisement