సింగిల్ స్క్రీన్లకు ప్రాణం పోస్తున్న సీఎం రేవంత్ నిర్ణయం.. టికెట్ రేట్లు పెంచొద్దంటూ?

స్టార్ హీరోల అభిమానులు తమ ఫేవరెట్ హీరోల సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో (First day first show)చూడాలని ఆశ పడతారు.

అయితే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల టికెట్ రేట్లు సినీ అభిమానులను ఒకింత భయాందోళనకు గురి చేస్తున్నాయి.

స్టార్ హీరోల సినిమాలను ఫస్ట్ వీకెండ్ లో చూడాలంటే 300 నుంచి 400 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.బెనిఫిట్ షోలు చూడాలంటే 800 నుంచి 1000 రూపాయలు ఖర్చు చేయాలి.

ట్రావెలింగ్ ఖర్చులు, పాప్ కార్న్ ఖర్చులు ఈ టికెట్ రేట్లకు అదనం అని చెప్పవచ్చు.ఒక్కో సినిమాకు ఒక్కోలా టికెట్ రేట్లు(Ticket prices) ఉండటంతో ప్రేక్షకులు సైతం ఒకింత గందరగోళానికి గురవుతున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy ) టికెట్ రేట్లను పెంచబోమని తీసుకున్న నిర్ణయం సింగిల్ స్క్రీన్లకు(single screens) ప్రాణం పోస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తక్కువ సంఖ్యలో ప్రేక్షకులతో ఎక్కువ డబ్బులు రాబట్టాలనే నిర్ణయం సరైనది కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telangana Cm Revanth Reddy Decision Plus For Single Screens Details Inside Goes
Advertisement
Telangana Cm Revanth Reddy Decision Plus For Single Screens Details Inside Goes

టికెట్ రేట్లు పెంచడం వల్ల థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గుతోంది.పెద్ద సినిమాలకు భారీ స్థాయిలో ఖర్చు చేసిన ప్రేక్షకులు మీడియం రేంజ్(Medium range) సినిమాలను, చిన్న సినిమాలను థియేటర్లలో చూడటానికి ఇష్టపడటం లేదు.మన దేశంలో థియేటర్ల సంఖ్య సైతం క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే.

కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది.

Telangana Cm Revanth Reddy Decision Plus For Single Screens Details Inside Goes

మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్లు పెంచినా పరవాలేదని సింగిల్ స్క్రీన్లలో మాత్రం టికెట్ రేట్లను పెంచవద్దని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు సినిమా ఇండస్ట్రీలో సీఎం రేవంత్(CM Revanth ,industry) కామెంట్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ఇండస్ట్రీ పెద్దలు సీఎంను కలిసే యోచనలో ఉండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (telangana cm revanth reddy)నిర్ణయం సంక్రాంతి సినిమాలపై ప్రధానంగా ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు