అధ్యక్షా ..!: తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 17 నుంచే

తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన ఎమ్యెల్యేలంతా ఎప్పుడా.ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది.

చాలా రోజుల సమయం తరువాత .తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.ఈ నెల పదిహేడున కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.అలాగే.18 న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తాత్కాలిక స్పీకర్ గా ముఖ్యమంత్రి కెసిఆర్ నియమించారు.

ముఖ్యమంత్రి తర్వాత ఆయన అత్యంత సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.ఆరుసార్లు గెలిచారు.

ఈ నేపథ్యంలో జనవరి 16న సాయంత్రం 5గంటలకు ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు.రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌తో ప్రమాణం చేయిస్తారు.17న శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి.119 మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.19న శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు.20న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది.

Advertisement

.

Advertisement