వరిను నేరుగా వెదజల్లే పద్దతిలో సాగు చేసే విధానంలో మెళుకువలు..!

వ్యవసాయ రంగంలో కూలీల కొరత అధికంగా ఉండడం వల్ల కొంతమంది రైతులు వరి( rice ) పంటను నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.

అయితే నేరుగా వెదజల్లి సాగు చేసే పద్ధతిలో పాటించాల్సిన సరైన యాజమాన్య పద్ధతులు ఏమో చూద్దాం.

నీటి వనరులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వరి పంటను సాగు చేస్తారు.కూలీల కొరత అధికంగా ఉండడం వల్ల దమ్ము చేసిన వరి మాగాణిలో నేరుగా వరి విత్తనాలు వెదజల్లి సాగు చేయవచ్చు.

కాకపోతే ఈ పద్ధతిలో సాగు చేస్తే కలుపు సమస్య అధికంగా ఉంటుంది.ఈ పద్ధతిలో సాగు చేస్తే ఒక ఎకరం పొలానికి 15 నుండి 20 కిలోల విత్తనాలు ఆదా అవుతాయి.

Techniques In The Method Of Cultivating Rice In Direct Spreading Method , Rice,

ఇక నారు పెంచడం, నారు పీకడం, నాట్లు వేయడం అనే పనులు ఉండవు.మొక్కలకు సరిపడే సాంద్రత ఉంటే దిగుబడి దాదాపుగా 10% పెరగడంతో పాటు ఒక ఎకరాకు పెట్టుబడి వ్యయం దాదాపుగా రూ.3,000 వరకు తగ్గుతుంది.ఈ పద్ధతిలో సాగు చేయాలంటే ఒక ఎకరాకు 30 కిలోల విత్తనాలు అవసరం.

Advertisement
Techniques In The Method Of Cultivating Rice In Direct Spreading Method , Rice,

అదే దొడ్డు రకాల విత్తనం అయితే 12 కిలోలు అవసరం.సన్న రకాల విత్తనం అయితే ఎనిమిది కిలోలు అవసరం.

ప్రతి రెండు మీటర్లకు ఒక అడుగు కాలిబాటలు ఉండేవిధంగా చూసుకోవాలి.

Techniques In The Method Of Cultivating Rice In Direct Spreading Method , Rice,

ఎరువుల విషయానికి వస్తే.ఒక ఎకరాకు 80 కిలోల యూరియా( Urea ), 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్( Murate of Potash ) ఎరువులు అవసరం.ఈ ఎరువులను మూడు సమభాగాలుగా విభజించి విత్తనాలు వెదజల్లిన 20 రోజులకు, 40 రోజులకు, 60 రోజులకు పొలంలో చల్లుకోవాలి.

ఈ పద్ధతిలో కలుపు సమస్య కాస్త అధికంగా ఉండడం వల్ల విత్తనాలు వెదజల్లిన 48 గంటల లోపు ఒక ఎకరాకు 12 గ్రాముల కెంపా ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

Advertisement

తాజా వార్తలు