కాంగ్రెస్ పార్టీని వీడిన మిలింద్ దియోరాపై శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన కీలక నేత సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రస్తుతం అధికారం కోసమే రాజకీయాలని తెలిపారు.
పార్టీకి విధేయత అనే అంశం అసలు ఉనికిలోనే లేదని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.సిద్ధాంతాలు, విలువలు మరియు విశ్వాసానికి స్థానం లేదన్నారు.
మిలింద్ తండ్రి గురించి ఆయన మాట్లాడుతూ దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన వ్యక్తి అని తెలిపారు.అయితే మహారాష్ట్ర కాంగ్రెస్ నేత మిలింద్ దియోర కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ తో తమకు ఉన్న 55 సంవత్సరాల అనుబంధం ముగిసిపోయిందని,తన రాజకీయ చరిత్రలో మరో అధ్యాయానికి తెర పడిందని వెల్లడించారు.