నోనీ పంట సాగు చేసే విధానంలో మెళుకువలు..!

ఇటీవలే కాలంలో రైతులు కొత్త రకాల పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

కానీ కొత్త రకాల పంటలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.

అయితే నోనీ పండులో( noni crop ) ఎన్నో ఔషధాలు ఉండడం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.కాబట్టి సరైన మెలకువలతో నొనీ పంటను సాగు చేసే విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ప్రధాన పొలంలో నాటుకునే మొక్కలు బలమైన చెట్టు నుండి తీసిన కాండం ద్వారా తీసిన మొక్కను నర్సరీలో అభివృద్ధి చేసుకోవాలి.ఒక ఎకరం పొలంలో దాదాపుగా 300 మొక్కలను నాటుకోవచ్చు.

మొక్కల మధ్య 12 అడుగుల దూరం ఉంటే చీడపీడల బెడద కాస్త తక్కువగా ఉంటుంది.

Advertisement

మొక్కలు పెరిగే కొద్దీ మొదటి మూడేళ్ల వరకు ప్రూనింగ్ చేసుకోవాలి.మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగకుండా కొమ్మలను కత్తిరించాలి.ఫలితంగా మొక్కలు గుబురుగా పెరిగి ఎక్కువ పండ్లను ఉత్పత్తి చేస్తాయి.

మొక్కలు చిన్న దశలో ఉన్నప్పుడు N:P:K నిష్పత్తి 14:14:14 లేదా 16:16:16 తో సమతుల్య ఎరువులు వేయాలి.ఈ ఎరువులను సంవత్సరం లోపు మొక్కలకు నెలకు 1/4 కిలో, ఆ పైబడిన మొక్కలకు 1/2 కిలో వరకు ఎరువులను వేసుకోవచ్చు.

ఈ పంట శీతాకాలంలో కంటే వేసవికాలంలో అధిక దిగుబడి ఇస్తుంది.

పొలంలో కలుపు సమస్యను ప్రొటెక్టెడ్ స్ప్రేయింగ్( Protected spraying ) పద్ధతిలో రౌండ్ ఆఫ్ కలుపు మందు తో నివారించవచ్చు.ఈ నోనీ పండ్లు తెల్లగా మారడం ప్రారంభించి కొంచెం వాసన రావడం మొదలైతే పండు పూర్తిగా పండినట్లు అర్థం.మొదటి నాలుగు సంవత్సరాలు పంట దిగుబడి సాధారణంగా ఉంటుంది.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

తర్వాత ఒక హెక్టారు పొలంలో సుమారు 80 వేల కిలోల దిగుబడి పొందవచ్చు.ఈ మొక్క యొక్క ఆకులు, పండ్లు, వేర్లు సాంప్రదాయ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.

Advertisement

తాజా వార్తలు