సుశాంత్ పుట్టినరోజు సంద‌ర్భంగా `రావణాసుర` నుంచి స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్‌

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర`.కీల‌క‌మైన భారీ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

రవితేజతో పాటు కీలక పాత్రలో నటిస్తున్న సుశాంత్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు.ఈరోజు సుశాంత్ పుట్టినరోజు.

ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ టీమ్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.సుశాంత్ నీలి రంగు క‌ళ్ళ‌తో, పొడవాటి జుట్టు, గడ్డంతో తీక్ష‌ణంగా చూస్తున్నట్లు క‌నిపిస్తున్నాడు.

దీనిని బ‌ట్టి ఆయ‌న పాత్ర వైవిధ్యంగా వుంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

Advertisement

అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ మొత్తం ఐదుగురు కథానాయికలు నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా నటిస్తున్నాడు.రచయితగా కొన్ని ప‌వ‌ర్‌ఫుల్ చిత్రాల‌కు ప‌నిచేసిన‌ శ్రీకాంత్ విస్సా ఈ సినిమా కోసం కొత్త తరహా కథను రాశారు.

ప్రముఖ నటులు, సాంకేతిక సిబ్బంది ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు.హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం, శ్రీకాంత్ ఎడిటర్.

Advertisement