చరిత్ర తిరగరాసిన రవిచంద్రన్ అశ్విన్‌.. అందులో నంబర్. 1!

రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్, బ్యాటింగ్‌లో బాగా రాణించే భారత క్రికెటర్.ఈ ప్లేయర్ తాజాగా ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డు సృష్టించాడు.

ఇతను అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్ తరఫున ఆడుతున్నప్పుడు మరే ఇతర భారతీయ బౌలర్ తీయనన్ని వికెట్లు తీశాడు.ఇటీవలే నాగ్‌పూర్‌లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ మ్యాచ్‌లో, అతను 8 వికెట్లు పడగొట్టాడు.

అలా ఇప్పుడు భారత విజయాలలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ కంటే ఎక్కువ వికెట్లు సాధించాడు.

రవిచంద్రన్ అశ్విన్ మూడు క్రికెట్ ఫార్మాట్లలో టీమ్ ఇండియా సాధించిన విజయాలలో 489 వికెట్లు పడగొట్టాడు.ఇది ఇతర భారత బౌలర్ల కంటే ఎక్కువ, అనిల్ కుంబ్లే 486 వికెట్లతో రెండవ స్థానంలో, హర్భజన్ సింగ్ 410 వికెట్లతో ఉన్నారు.నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్‌లో అశ్విన్ 8 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

సిరీస్‌లోని మిగిలిన మూడు టెస్ట్ మ్యాచ్‌లలో తన సంఖ్యను పెంచుకునే మంచి అవకాశం ఉంది.

నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్‌లో, అతను 8 వికెట్లు తీసి భారత్‌ను గెలిపించాడు, స్పిన్నర్లు మొత్తం 20 వికెట్లలో 16 వికెట్లు తీశాడు.అశ్విన్ బౌలింగ్ స్కిల్స్ ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇదే విధమైన బౌలింగ్ శైలితో స్పిన్నర్‌ను కూడా నియమించుకుంది.అశ్విన్ ఎక్స్‌పీరియన్స్‌డ్‌ క్రికెటర్, అతను ప్రత్యర్థి బ్యాటర్లపై మైండ్ ప్లే ఉపయోగించగలడు.

ఇలా సైకాలజికల్ స్కిల్స్ ఉపయోగించి ప్రత్యర్థి బ్యాటర్లను గజగజా వణికించగలడు.అందుకే అతడు ఇతరుల కంటే ఎక్కువ శక్తివంతమైన బౌలర్‌గా మారాడు.

ఈ ప్లేయర్ 2010 నుంచి భారతదేశం తరఫున 89 టెస్ట్ మ్యాచ్‌లు, 113 వన్డే ఇంటర్నేషనల్స్, 65 T20 మ్యాచ్‌లు ఆడాడు.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు