అమరావతిలో టీడీపీ వర్సెస్ వైసీపీ... తీవ్ర ఉద్రిక్తత

అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతోంది.

ఈ క్రమంలో అమరలింగేశ్వర ఆలయానికి ఇరు పార్టీల నేతలు చేరుకున్నారు.మాజీ ఎమ్మెల్యే కొమ్మలాపాటి శ్రీధర్ ఆలయం లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా.

పోలీసులు అడ్డుకున్నారు.ఈ నేపథ్యంలోనే శ్రీధర్ తో పాటు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

ఇదే సమయంలో అటు వైసీపీ ఎమ్మెల్యే శంకర్ రావు చేరుకున్నారు.ఇసుక అక్రమ తవ్వకాలపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

ఈ క్రమంలో ఆలయం వద్దకు పార్టీ కార్యకర్తలు భారీగా చేరకుంటున్నారు.మరోవైపు పోలీసులు 144 సెక్షన్ విధించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023
Advertisement