కాపుల్లో చీలిక పై టీడీపీ టెన్షన్ ?

2024 ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్న కుల సమీకరణాలు కీలకం కాబోతున్నాయి.ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కులాల వారిగా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

అయితే ఏపీ లో కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండటం , అధికార పార్టీ వైసీపీ కంటే టిడిపికి ఎక్కువ టెన్షన్ పుట్టిస్తోంది.ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ప్రజల్లో సానుకూలత బాగా కనిపించినా,  ఈ మధ్యకాలంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాల్లో కోతలు ఇవన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెంచిందని టిడిపి నమ్ముతోంది .దీంతో తమకు పరిస్థితి అనుకూలంగా ఉందని టిడిపి లెక్క వేసుకుంటున్న సమయంలో కాపు సామాజిక వర్గం లో చీలికలు రావడం,  ఇప్పుడు టిడిపి లో ఆందోళన పెంచుతోంది.      రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావాలని టిడిపి ఆశలు పెట్టుకుంది.

అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు సామాజిక వర్గంలో చీలిక రాబోతూ ఉండడం తో టిడిపి టెన్షన్ పడుతోంది.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి బీసీ సామాజికవర్గం దగ్గరవుతూ ఉండడంతో,కాపు - బీసీ కాంబినేషన్ లో గట్టెక్కుతాము అని భావించారు.

కానీ ఇప్పుడు ముద్రగడ ఎత్తుగడ తో ఆ సమీకరణాలు అసాధ్యం అనేది టిడిపి అంచనా వేస్తోంది.ముద్రగడ పద్మనాభం తో పాటు బీసీ, ఎస్సీ సామాజిక వర్గం లోని కొంతమంది నాయకులు ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా తెరపైకి వస్తూ ఉండడం తో వారి వెనుక ఎవరున్నారు , ఎవరి ప్రోద్బలంతో ఈ విధంగా ముందడుగు వేస్తున్నారనేది టిడిపి ఆరా తీసే పనిలో నిమగ్నమైంది. 

Tdp Tention On Kapu Caste Voting Issue Kapu Caste, Jagan, Ysrcp, Tdp, Ap, Ysrcp,
Advertisement
Tdp Tention On Kapu Caste Voting Issue Kapu Caste, Jagan, Ysrcp, TDP, Ap, Ysrcp,

  ఇప్పుడు ముద్రగడ యాక్టివ్ కావడం వల్ల టిడిపికి పడే ఓట్లలో చీలిక వస్తుందని,  టిడిపి అంచనా వేస్తోంది .కొత్తగా ముద్రగడ పార్టీ పెట్టినా,  ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసుకున్న కాపులకు మేలు జరిగేది ఏమీ లేదని టిడిపి గట్టిగా ప్రచారం చేయాలని భావిస్తోంది. 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా వైసీపీకి మద్దతుగా నిలబడింది.

ఇప్పుడు వైసీపీ పై కాపు సామాజిక వర్గం లో వ్యతిరేక ఎక్కువ అవ్వడం జనసేన బాగా పుంజుకోవడంతో పరిస్థితులు తమకు అనుకూలంగా మారబోతున్నాయి అనుకుంటున్న సమయంలో ఈ తరహా వ్యవహారాలు చోటుచేసుకోవడం తో టీడీపీ లో ఈ తరహా టెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు