టీడీపీ రెడ్డి గారు జంప్ చేసేస్తారా... బాబుకు మ‌రో షాక్‌...!

ఏపీలో విప‌క్ష టీడీపీలో వ‌రుస‌గా ప‌డుతోన్న వికెట్ల ప‌రంప‌ర‌లో మ‌రో వికెట్ ప‌డ‌నుంది.కీల‌క‌మైన వైజాగ్ న‌గ‌రంలో పార్టీకి వెన్నుద‌న్నుగా ఉన్న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి స్వాతి ప్ర‌మోట‌ర్స్ అధినేత స్వాతి కృష్ణా రెడ్డి సైకిల్ దిగేందుకు రెడీ అవుతున్నారా ? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే చెపుతున్నాయి.

విశాఖ సిటీలో పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎన్నో కులాల నేత‌ల‌కు ఏదో ఒక ప‌ద‌విని క‌ట్ట‌బెట్టిన చంద్ర‌బాబు రెడ్ల‌ను పూర్తిగా విస్మ‌రించారు.

విశాఖ‌తో పాటు ఉత్త‌రాంధ్ర‌లో రెడ్లు పెద్ద‌గా లేన‌ప్ప‌ట‌కి స్వాతి కృష్ణా రెడ్డి లాంటి నేత‌లు పార్టీకి ఎప్పుడూ ఆర్థికంగా అండ‌గా నిలిచారు.ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న విశాఖ ఉత్త‌రం సీటు కూడా ఆశించారు.

పార్టీ కార్య‌క‌లాపాల కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ‌డంతో పాటు భారీగా ఖ‌ర్చు చేశారు.టీడీపీ పాల‌న‌లో జీవీఎంసీ ఎన్నిక‌లు జ‌రిగితే ఖ‌చ్చితంగా ఆయ‌న మేయ‌ర్ ప‌ద‌వి ద‌క్కించుకునే వారు.

అయితే జీవీ ఎంసీ ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి.ఇక ఇప్పుడు ఉత్త‌రం సీటు కూడా ఇవ్వ‌లేదు.

Advertisement
TDP Reddy Will Jump And Give Shock To Chandra Babu- TDP- Chandra Babu- Reddy- Sh

గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడినా ఆయ‌న మాత్రం పార్టీలోనే కొన‌సాగుతున్నారు.ఇక ఇప్పుడు ఉత్త‌రాంధ్ర‌పై గ‌ట్టిగా ఫోక‌స్ చేసిన బీజేపీ కృష్ణారెడ్డిపై గురి పెట్టింద‌ని అంటున్నారు.

Tdp Reddy Will Jump And Give Shock To Chandra Babu- Tdp- Chandra Babu- Reddy- Sh

అయితే కృష్ణారెడ్డి నేరుగా పార్టీ మార‌కుండా త‌న‌కున్న వ్యాపార అవ‌స‌రాల నేప‌థ్యంలో త‌న కుమారుడు రమేష్ రెడ్డిని బీజేపీలోకి పంపుతున్నారని టాక్.సరైన సమయం చూసుకుని తాను కూడా కమల తీర్ధం పుచ్చుకుంటారని స్థానికంగా ప్ర‌చారం న‌డుస్తోంది. టీడీపీ వైజాగ్ న‌గ‌రంలో దివంగ‌త మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి వెన్నుద‌న్నుగా ఉండేవారు.

ఇక గంటా లాంటి వాళ్లు ఉన్నా సైలెంట్ గానే ఉంటున్నారు.ఇప్పుడు స్వాతి కృష్ణారెడ్డి లాంటి వాళ్లు కూడా పార్టీ మారిపోతే అక్క‌డ పార్టీకి పైస‌లు విదిల్చే నాయ‌కులు క‌రువు అవుతారు.

కృష్ణారెడ్డి వైజాగ్ సిటీలో సైకిల్ దిగిపోతే అక్క‌డ చాలా మంది బ‌య‌ట‌కు వ‌చ్చినా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర్లేదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు