చంద్రబాబు అరెస్టుకి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసన దీక్షలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని( Chandrababu Naidu ) ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో( Skill Development Scam ) చంద్రబాబుని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.

శనివారం ఉదయం కర్నూలు నంద్యాలలో నోటీసులు ఇచ్చి చంద్రబాబుని అరెస్టు చేసి కాన్వాయ్ ద్వారా సాయంత్రం విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు.

( Kinjarapu Atchannaidu ) చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలకు పిలుపునిస్తూ పత్రిక ప్రకటన చేశారు.

Tdp Protests Across The State Tomorrow In Protest Against Chandrababu Arrest Det

"టీడీపీ( TDP ) జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టు, పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా రేపు (10-09-2023) రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ ప్రధాన కేంద్రాలలో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించాలని నిర్ణయించటమైనది.వైసీపీ ప్రభుత్వ( YCP ) సైకో చర్యలకు నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం" అంటూ అచ్చెన్నాయుడు. పత్రికా ప్రకటన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

Advertisement
TDP Protests Across The State Tomorrow In Protest Against Chandrababu Arrest Det
'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..

తాజా వార్తలు