చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా విజయవాడలో టీడీపీ నిరసన

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా విజయవాడలో పార్టీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ మేరకు దుర్గగుడి కార్యక్రమాన్ని చేపట్టారు.

అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.ఇంద్రకీలాద్రి కొండ కింద ఉన్న వినాయకుడి ఆలయం నుంచి దుర్గగుడి వద్దకు పాదయాత్రగా వెళ్లి అమ్మవారికి సారె సమర్పించాలని టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.

దాంతో పాటు టీడీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని భావించారు.అయితే అనుమతి లేని పక్షంలో టీడీపీ నేతలకు పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలోనే పలువురు నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.కొల్లు రవీంద్ర సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

తాజా వార్తలు