సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర

సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడిపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర స్పందించారు.సింపతీ కోసం సీఎం జగన్ గురక రాళ్ల డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు.

2019లో కోడి కత్తితో దాడి చేయించుకున్న జగన్ నేడు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను సింపతీగా మార్చుకునేందుకు తనపై తానే రాళ్ల దాడి చేయించుకున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు.ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

జగన్ బస్సు యాత్ర చేస్తున్నప్పుడు కరెంట్ తీసింది ఎవరో.జగన్ పయనిస్తున్న బస్సును చీకట్లో పంపింది ఎవరో తెలియాలన్నారు.

దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

తాజా వార్తలు