వైకాపా నాయకులది బస్సు యాత్ర కాదు.. తుస్సు యాత్ర..: ఎంపి రామ్మోహన్ నాయుడు

ఏ అభివృద్ధి చేతకాని వైసిపి నాయకులకు అధికారం ఎందుకని ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం మధనాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో శ్రేణులతో కలసి ఎంపి పాల్గొన్నారు.

తనదైన శైలిలో ప్రభుత్వంపై పదునైన విమర్శలు సంధించారు.పలాస నియోజకవర్గ రైతుల కు సాగునీరు అందించలేక టిడిపి నాయకులపై నిందలెసిన అప్పలరాజుకు మంత్రి పదవి అవసరమా అని ప్రశ్నించారు.

Tdp Mp Ram Mohan Naidu Fires On Ycp Bus Yatra, Tdp, Mp Ram Mohan Naidu , Ycp Bus

వైసీపీ నాయకులు చేస్తున్న యాత్ర బస్సు యాత్ర కాదని అదొక తుస్సు యాత్రని ఎద్దేవా చేశారు.నియోజకవర్గంలో ఏ ఒక్క అభివృద్ధి పని చెయ్యలేని చేతకాని మంత్రి అని పలాస నియోజకవర్గం లో మంత్రి అప్పలరాజు చేసిన పని ఏదైనా ఉందా అంటే అది కేవలం కబ్జా చేసి మింగేసిన కొండలు మాత్రమే ప్రజలకు కనిపిస్తున్నాయన్నారు.

రాబోయే ఎన్నికల్లో జనసెన టిడిపి కలసి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గౌతు శిరీషను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.వలసలు వచ్చే వాళ్ళును సాదరంగా స్థానిక నాయకులు కార్యకర్తలు ఆహ్వానించాలని కోరారు.

Advertisement

నేటి నుంచి కార్యకర్తలు "బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారంటీ" కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వాలని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు