టీడీపీ ఎమ్మెల్యే రౌడీయిజం (వీడియో)

ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ కాంట్ర‌వ‌ర్సీగా వ్య‌వ‌హ‌రించిన తీరు, వాడిన భాష ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వైవీబీ తాను కొనుక్కున్న ఓ కొత్త కారుకు ఫ్యాన్సీ నెంబ‌ర్ కోసం బెదిరింపుల‌కు దిగిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

కృష్ణా జిల్లా ఉయ్యూరు ఆర్టీవో ఆఫీస్‌లో ఫ్యాన్సీ నంబర్ ఏపీ 16 డిడి 7777 కోసం వైవీబీ అనుచ‌రుల‌తో పాటు మ‌రో వ్య‌క్తి కూడా పోటీప‌డ్డారు.ఆ వ్య‌క్తి వైసీపీ మ‌ద్ద‌తుదారుడిగా తెలుస్తోంది.

ఈ నెంబ‌ర్ కోసం ఇటు వైవీబీ రాజేంద్ర‌ప్ర‌సాద్ అనుచ‌రుల‌తో పాటు ఇటు వైసీపీ మ‌ద్ద‌తుదారులు పోటీప‌డ‌డంతో వైవీబీ అనుచ‌రులు బెదిరింపుల‌కు కూడా దిగిన‌ట్టు వైసీపీ మ‌ద్ద‌తుదారులు ఆరోపిస్తున్నారు.ఈ క్ర‌మంలోనే ఉయ్యూరు ఆర్టీవో కార్యాల‌యం ద‌గ్గ‌ర ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వివాదం జ‌రిగింది.

ఈ క్ర‌మంలోనే అక్క‌డ జరిగిన గొడ‌వ‌ను సాక్షి ప‌త్రిక కెమేరామెన్లు షూట్ చేశారు.త‌ర్వాత ఈ వ్య‌వ‌హారం సాక్షి ఛానెల్‌తో పాటు సోష‌ల్ మీడియాలో కూడా హ‌ల్‌చ‌ల్ చేసింది.

Advertisement

దీనిపై మీడియా ముందుకు వ‌చ్చిన వైవీబీ ఘాటుగా రిప్లే ఇచ్చారు.ఫ్యాన్సీ నెంబ‌ర్ కోసం త‌న‌కు రౌడీయిజం చేయాల్సిన అవ‌స‌రం లేదని.

రౌడీయిజం చేస్తే ఆ వ్య‌వ‌హారం వేరేగా ఉంటుంద‌ని చెప్పారు.ఇక ఇదే అంశంపై వైవీబీ దీనిని సూట్ చేసిన వ్య‌క్తికి ఫోన్ చేసి చాలా అస‌భ్య‌క‌ర‌మైన ప‌ద‌జాలం వాడుతూ హెచ్చిరిక‌గా మాట్లాడారు.

ఈ గొడవలో తాను కృష్ణా జిల్లా యాసలో మాత్రమే మాట్లాడానని చెప్పిన వైవీబీ.తాను రౌడీయిజం మాత్రం చేయలేదని చెప్పుకొచ్చారు.

ఇక ఈ గొడ‌వ‌ను వైసీపీ భూత‌ద్దంలో పెట్టి పెద్ద‌ది చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఫైర్ అయ్యారు.మ‌రి వైవీబీ ఎంత అస‌భ్యంగా మాట్లాడారో ఈ వీడియోనే చెపుతోంది.

ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు