కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే..!!

టీడీపీ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు( MLA Eluri Sambasivarao ) కేంద్ర ఎన్నికల సంఘానికి సోమవారం లెటర్ రాశారు.

వైసీపీ ప్రభుత్వం అక్రమంగా ఓట్లు తొలగింపుకు పాల్పడుతుందని.

దీనికి బూతు లెవెల్ ఆఫీసర్స్ మరియు పోలీస్ అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపించారు.ఫారం నెం.7 ద్వారా తెలుగుదేశం పార్టీ ఓటర్లను తొలగించడానికి వైసీపీ( YCP ) తరపున పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్నారని ఆరోపించారు.ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓటర్లను తొలగించడానికి ఎన్నికల సిబ్బందిపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు.

విద్యా, ఉపాధి ఇంకా ఉద్యోగ అవసరాల కోసం నియోజకవర్గం నుండి తాత్కాలికంగా బయటకు వెళ్లిన వారి ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారని ఆరోపించారు.తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి ఓటర్లను భారీ ఎత్తున తొలగించడానికి కుట్ర జరుగుతున్నట్లు తెలియజేశారు.

ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లేఖలో స్పష్టం చేయడం జరిగింది.అంతేకాకుండా ఆధారాలతో సహా తాము చేస్తున్న ఫిర్యాదులపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని కోరారు.

Advertisement
ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఈ ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్ళకండి..!

తాజా వార్తలు