టీడీపీకి, ఎమ్యెల్యే సభ్యత్వానికి 'రావెల' రాజీనామా ! ఆ పార్టీలో చేరబోతున్నాడా ..?

అకస్మాత్తుగా తనను పక్కనపెట్టడంతో రగిలిపోతున్న ఓ టీడీపీ ఎమ్యెల్యే ఎట్టకేలకు పార్టీకి రాజీనామా చేశారు.పార్టీలో ఉన్నా.

రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో.ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

టీడీపీ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి ఆ తరువాత పదవి పోగొట్టుకున్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌‌బాబు టీడీపీకి రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో అందజేశారు.

మరోవైపు టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన ఆయన రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో మరో లేఖ అందజేశారు.

Advertisement

డిసెంబర్ 1న విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో రావెల పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.అయితే రావెల జనసేనకంటే ముందు వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.కానీ అందుకు జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పలు దపాలుగా చర్చలు జరిపి అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పుడు టీడీపీకి, శాసనసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు.

Happy Luke Bonuses: A Practical Breakdown For UK Players
Advertisement