Ganta Srinivasa Rao : అనుకున్నది సాధించిన గంటా.. భీమిలి నుంచే పోటీ

టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు( TDP MLA Ganta Srinivasa Rao ) అనుకున్నది సాధించగలిగారు.

వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేయాలని గంటా శ్రీనివాస్ రావు భావించారు.

దీనికి తగ్గట్లుగానే టిడిపి అధిష్టానం పైన ఈ విషయంలో ఒత్తిడి చేశారు.అయితే చంద్రబాబు మాత్రం విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) పై గంటాను పోటీకి దింపాలని భావించారు .ఇదే విషయాన్ని గంటాకు చెప్పినా,  చీపురుపల్లి వెళ్లేందుకు ఆయన ఆసక్తి చూపించలేదు.  దీంతో భీమిలితో పాటు,  చీపురుపల్లి నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు.

ఎంతకీ చీపురుపల్లి వెళ్లేందుకు గంటా ఇష్టపడకపోవడంతో ఆయన ను ఎట్టకేలకు భీమిలి నుంచే పోటీకి దింపాలని  చంద్రబాబు డిసైడ్ అయ్యారు.చీపురుపల్లిలో తాను పోటీకి దిగితే ఫలితం ఎలా ఉందుంటి అనే దానిపై గంటా సర్వేలు చేయించుకున్నారు.

చంద్రబాబు సైతం గంటా పై ఒత్తిడి చేసినా,  తాను జిల్లా దాటి వెళ్ళేది లేదని గంటా పట్టు పట్టడంతో చేసేది లేక ఆయనకు భీమిలి టికెట్ ను చంద్రబాబు ఖరారు చేశారు. బిజెపి( BJP )కి శ్రీకాకుళం కాకుండా ఎచ్చెర్ల కేటాయించాలి అనుకోవడంతో అక్కడ ఉన్న కళ వెంకటరావును చీపురుపల్లికి పంపాలని ముందుగా చంద్రబాబు భావిస్తున్నారు.  దీంతో గంటా శ్రీనివాసరావుకు భీమిలి ఫైనల్ చేయబోతున్నట్లు సమాచారం.

Advertisement

అలాగే టికెట్ ఖరారు చేసేందుకు నిర్వహించే ఐవిఆర్ఎస్ ఫోల్( IVRS Poll ) కూడా భీమిలిలో నిర్వహించారు.ఇక గంటా పేరును అధికారికంగా ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉంది.ఇప్పటికే కొంతమంది టీడీపీ సీనియర్లలో చాలామందికి ఈసారి టిక్కెట్ దక్కలేదు ఆ జాబితాలోనే గంటా పేరు కూడా ఉంటుందని అంతా భావించారు .కానీ చివరి నిమిషం లో చంద్రబాబు గంటాకు భీమిలి టిక్కెట్ ను ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో గంటా అనుచరుల్లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు