పవన్ పై యూ టర్న్ తీసుకున్న టిడిపి మీడియా??

రెండు నెలల క్రితం వరకు పొత్తులు చారిత్రక అవసరమని, కచ్చితంగా పొత్తులతో వస్తామని ప్రభుత్వాన్ని గద్దింపుతామంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన జనసేనా ని ఇటీవల వారాహి యాత్ర( Varahi ) వేదికగా టోన్ మార్చి తాను సీఎం పదవి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే .

కచ్చితంగా పొత్తులు ఉంటాయని ఇంతకాలం జనసేన కి మీడియా సపోర్ట్ ఇచ్చిన తెలుగుదేశం మీడియా ( TDP Media )వర్గం ఈ వ్యాఖ్యలతో ఆలోచనలు పడినట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి.

తెలుగుదేశం జనసేన పొత్తులో అతిపెద్ద భాగస్వామి తెలుగుదేశం కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడానికి పవన్ ఉపయోగపడతారని భావించిన మీడియా తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటున్న పవన్( Pawan kalyan ) వ్యాఖ్యలతో డైలమాలో పడినట్లు తెలుస్తుంది.ఇటీవల ఆ మీడియా ప్రసారం చేస్తున్న వార్తా కథనాలు కూడా క్రమంగా పవన్ వ్యతిరేకదారిని తీసుకుంటునట్లు తెలుస్తుంది .

తన అనుకూల విశ్లేషకులు ద్వారా పవన్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయించే కార్యక్రమాన్ని అప్పుడే ఒక వర్గం మీడియా మొదలుపెట్టిందని వార్తలు వస్తున్నాయి.తమకు అనుకూలంగా ఉన్నంతవరకే హైప్ ఇస్తామని ఒకసారి వ్యతిరేకంగామాట్లాడితే మాత్రం నిలదీస్తామంటూప్లేట్ తిప్పేసిన మీడియా వైఖరి ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది .అయితే టిడిపి మీడియా రాజకీయాలు మొదటి నుంచి తెలిసిన వ్యక్తిగా పవన్ ఈ పరిణామాలకు బెదిరే రకం కాదని, తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ పై స్పష్టమైన అవగాహనతోనే ముందుకు వెళ్తున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి .

కొంత కాలం క్రితం సీఎం సీటు పై ఒక అడుగు వెనక్కి వేసినట్లుగా పవన్ చేసిన వ్యాఖ్యలతో జనసేన శ్రేణులు ఒకింత నిరుత్సాహం చెందాయి.ఆయనను అభిమానిస్తున్న వర్గాలు ఆయన సామాజిక వర్గ నేతలు కూడా ఈదొరణితో ఎన్నికలకు వెళ్తే సరైన ఫలితాలు రావని హితబోధ చేసినందునే ఈ విషయంలో పవన్ వెనకడుగు వేశారని ,తనని తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ పరిణామంతో ఇరకాటం లో పడిన తెలుగుదేశం అనుకూల మీడియా ఇప్పుడు పవన్ కి మద్దతు పై యూ టర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది .ముందు ముందు పరిణామాలు ఇంకెలా మారబోతున్నాయో చూడాలి .

Advertisement
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

తాజా వార్తలు