పొత్తులపై బాబు అయోమయం ! సొమ్ముల టెన్షన్ లో నేతలు 

టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెట్టేశారు.ముఖ్యంగా పొత్తుల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి పార్టీ నేతలకు అర్థం కావడం లేదు.

జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ ముఖ్యమంత్రి పదవి విషయంలో జనసేన విధిస్తున్న కండిషన్లు బాబుకు ఆగ్రహం కలిగిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప, వైసీపీ ని ఎదుర్కోవడం కష్టం అనే అభిప్రాయంలో ఉన్నారు.అందుకే ఎన్నికల సమయంలో సంగతి తరువాత చూడొచ్చని,  అప్పటిలోగా టిడిపిని అన్ని నియోజకవర్గాల్లోనూ బలోపేతం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే జిల్లాల వారీగా పర్యటనలు చేపడుతూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.       ఇప్పటి వరకు ఆయన శ్రీకాకుళం , విజయనగరం జిల్లాలో పర్యటించారు.

Advertisement

అనకాపల్లి , నెలిమర్లలో మినీ మహానాడు ను నిర్వహించారు.జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నా,  టిడిపి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహిస్తూ, టిడిపిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో బాబు ఉన్నారు.

ఇదిలా ఉంటే ఖచ్చితంగా పొత్తు పెట్టుకునే ఎన్నికలకు వెళ్లే ఆలోచన లో బాబు ఉండడంతో, జనసేన పార్టీకి పట్టు ఉన్న నియోజకవర్గాల్లోని టిడిపి నేతలు టెన్షన్ పడుతున్నారు.నియోజకవర్గాల్లోనూ మినీ మహానాడు నిర్వహించాలని , ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేపట్టాల్సిందిగా నియోజకవర్గ స్థాయి నాయకులకు ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు ఆందోళన చెందుతున్నారు.   

  ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది .ఇప్పుడు పార్టీ మినీ మహానాడు తో పాటు,  ఎన్నికల వరకు ఏదో ఒక కార్యక్రమం నిరంతరం చేయాల్సి ఉండటంతో దానికి భారీగా సొమ్ము ఖర్చు పెట్టాలని, అయినా ఈ ఎన్నికల్లో తమకు టిక్కెట్ వస్తుందన్న గ్యారెంటీ లేదని,  పొత్తులో భాగంగా జనసేన కు కనుక తమ నియోజకవర్గాన్ని కేటాయిస్తే అప్పుడు తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన కలుగుతోంది.తాము ఎన్నికల వరకు సొమ్ము ఖర్చు పెడితే, బాబు ఆ నియోజకవర్గాన్ని మిత్రపక్షంకు కేటాయిస్తే, అప్పటి వరకు తాము పెట్టిన ఖర్చు సంగతేంటి అనే ప్రశ్నలు ఇప్పుడు టిడిపి నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న నాయకుల్లో కలుగుతోంది.

బీచ్ ఒడ్డున గ్లామర్ షోతో ఫోటోషూట్స్... చూసిన వాళ్లకు చుక్కలు
Advertisement

తాజా వార్తలు