జగన్ పై టీడీపీ పొలిటికల్ ర్యాగింగ్ ? సమాధానం ఏది ? 

రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లుగా ఆ పార్టీ నాయకుల వ్యవహారం ఉంది.

ప్రస్తుతం టిడిపి ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

ఒకపక్క తెలంగాణలో టిడిపి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది.ఆ పార్టీ శాసనసభ పక్షాన్ని టిఆర్ఎస్ లో విలీనం చేశారు.

ఇక తెలంగాణలో టిడిపి పూర్తిగా కనుమరుగైపోయింది అనే సంకేతాలు జనాల్లోకి వెళ్ళిపోయాయి.ఏపీలోనూ అటువంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి .ఎన్నికలలో టిడిపికి ఓటమి ఎదురవుతోంది.దీంతో సామాన్య కార్యకర్త నుంచి టిడిపి సీనియర్ నాయకులు వరకు అందరిలోనూ టిడిపి రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.

అయితే టీడీపీకి పునర్వైభవం తీసుకు వచ్చేందుకు చంద్రబాబు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని 2024లో గట్టెక్కాలని ప్లాన్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే చంద్రబాబు, లోకేష్ తో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు సైతం ఘాటు విమర్శలతో జగన్ పై విమర్శలు చేస్తున్నారు.

Advertisement
Tdp Leaders Coments Againist On Jagan About Vivekanandareddy Issue Jagan, Ysrcp

ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో జగన్ చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురికావడం, ఇది హత్యా, లేక ఆత్మహత్య అనే విషయంలో గందరగోళం నెలకొంది.దీనిపై వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

ఈ విషయంలో జగన్ తీరు పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.సరిగ్గా ఇదే అంశంపై టిడిపి ఇప్పుడు దృష్టి పెట్టింది.

తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య తో జగన్ కు సంబంధం ఉంది అన్నట్లుగా లోకేష్ అచ్చెన్న వంటి వారు విమర్శలు చేశారు.ఢిల్లీని టీ కొడతాను అంటూ పులి ఎలివేషన్లు ఇచ్చే పెద్ద పిల్లి గారు బాబాయ్ ని బాత్రూం లో పెట్టి, గొడ్డలి పోటు పొడిచింది మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కాని కాకపోతే లోకేష్ సవాల్ ని ఎందుకు స్వీకరించలేదు ? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా జగన్ కు సవాల్ విసిరారు.

Tdp Leaders Coments Againist On Jagan About Vivekanandareddy Issue Jagan, Ysrcp

 దీన్ని గుర్తుచేస్తూ అచ్చెన్న నాయుడు సైతం జగన్ ను విమర్శించారు మౌనం అర్ధాంగీకారం .బాబాయ్ ని వేసేసింది అబ్బాయి అనడానికి ఇంతకన్నా ఆధారం ఏం కావాలి ? మా లోకేష్ సవాల్ విసిరారు.14న వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా ? అంటూ ప్రశ్నించారు.హూ కిల్డ్ బాబాయ్ ? 14 న తేలిపోతుంది అంటూ టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేశారు.వివేకా హత్య వెనుక పులివెందుల రాజన్న కోట రహస్యం ఏంటో బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది జగన్   గారు ! ఏప్రిల్ 14న తిరుపతి వస్తున్నారా ? అంటూ టిడిపి ఎంఎల్సి బుద్ధ వెంకన్న సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు