బాబు ముందుకు నాయకులేమో వెనక్కి !

వయస్సు మీద మీదకు వచ్చి పడుతున్నా తెలుగుదేశం పార్టీని పరుగులు పెట్టించే విషయంలో అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడా తన దూకుడు తగ్గించడంలేదు.

ఏదో ఒక రకంగా పార్టీని గట్టెక్కించి స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో గట్టెక్కించాలని చూస్తున్నాడు.

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటోంది.దీనిపై ప్రజా ఉద్యమాలు చేసి మరింత ఇరుకున పెట్టేందుకు బాబు రకరకాల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు.

ఇంతవరకు బాగానే ఉన్నా నాయకులు మాత్రం ఆయా కార్యక్రమాలు చేపట్టేందుకు వెనకడుగు వేస్తూ అధినేతకు ఆగ్రహం తెప్పిస్తున్నారు.పార్టీ ఘోర ఓటమి పరాభవం నుంచి అధినేత తేరుకున్న, నాయకులు మాత్రం ఇంకా తేరుకోనట్టే కనిపిస్తోంది.

ఎన్నికల్లో ఇప్పటికే భారీగా ఖర్చు చేసి ఉండటం, చంద్రబాబు రోజుకొక ఆందోళనలకు పిలుపునివ్వడం పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు.

Tdp Leaders Afraid Of Ycp Party Leader Because Of Case File Against Tdp
Advertisement
Tdp Leaders Afraid Of Ycp Party Leader Because Of Case File Against Tdp-బా�

పార్టీ తరపున ఆందోళన కార్యక్రమాలు చేయాలనే కుతూహలం తమకు ఉన్నా, ఒక రోజు ఆందోళన చేయాలంటే లక్షల్లో చేతి చమురు వదులుతోందని, అదీ కాకుండా కార్యకర్తలను సమీకరరించడం, వారికి టిఫిన్ నుంచి భోజన సదుపాయాలను సమకూర్చడం వంటివి తప్పనిసరిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు కాని, టీడీపీ నాయకులు కానీ భరించాల్సి రావడంతో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నాయకులు ఉత్సాహం చూపించాడట.ఇటీవల ఇసుక కొరతపైఈ మధ్యనే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.అయితే ప్రకాశం జిల్లాను తీసుకుంటే ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దామచర్ల జనార్థన్ దూరంగా ఉన్నారు.

ప్రకాశం జిల్లాలో ఒక కనిగిరి నియోజకవర్గం తప్పిస్తే ఇంకా ఎక్కడా ఆందోళన కార్యక్రామాలు జరగలేదు.దామచర్ల జనార్థన్ తోపాటు మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యేలు కరణం బలరాం, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టి పాటి రవికుమార్, ఏలూరి సొంబశివరావులు నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు.

Tdp Leaders Afraid Of Ycp Party Leader Because Of Case File Against Tdp

ఇది కేవలం ఒక్క జిల్లాకే పరిమితం కాలేదు.రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.ఇక మండల కేంద్రాల్లో ఆందోళనలను నిర్వహించాలని చంద్రబాబు పిలుపునివ్వగా కనీసం నియోజకవర్గం కేంద్రాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు అంతంతమాత్రంగా నిర్వహించారట.

దీనిపై ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నారు.నేను స్వయంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా నాయకులు స్పందినకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

దీనిపై కొంతమంది నాయకులు స్పందిస్తూ తమకు కార్యక్రమాలు చేయాలనే ఉన్నాఆరికపరిస్థితుల కారణంగా వెనక్కి తగ్గుతున్నామని, కార్యాకర్తలు కూడా కేసుల భయంతో వెనక్కి తగ్గుతున్నారంటూ బాబు దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు