నూతన్ నాయుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు: మాజీమంత్రి నక్కా ఆనందబాబు

ఎన్నికల ముందు దళితులకు అది చేస్తాం ఇది చేస్తామని దొంగ వాగ్దానాలు చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు దళితుల ఓట్లతో గెలిచి వాళ్ళ పైనే దాడి చేయడం ఏంటని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.

దళితులపై దాడి టీడీపి ఏమాత్రం అంగీకరించదని దీనిపై తాము పోరాడుతామని ఆయన అన్నారు.

గ్రౌండ్ లెవెల్ లో వైసీపీ నాయకులు చేస్తున్న దందాలు బడుగు బలహీన వర్గాల పై చేస్తున్న దాడులను ప్రభుత్వం పట్టించుకోకుండా ఏం చేస్తుందని ఫైర్ అయ్యారు.వైసిపి సిద్ధాంత కర్త కాబట్టి నూతన నాయుడిని అరెస్ట్ చేయలేదా అనే ప్రశ్నకు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Nakka Anandh Babu Questions Nunthan Naidu Issue, Nunthan Naidu Arrest, TDP, YCP

ఇక విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఎస్సీల పట్ల పాలకపక్షం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా దళితులపై జరుగుతున్న దాడులలో వైసీపి నాయకుల పేర్లు వినపడుతున్నాయని టీడీపి ఆరోపిస్తుంది.

మరి వీటిని ప్రజలు రాజకీయ ఆరోపణలుగా చూస్తారా లేక నిజమని గుర్తిస్తారా అన్నది స్థానిక ఎన్నికలలో తెలియాల్సివుంది.

Advertisement
మొటిమలపై నిమ్మరసాన్ని ఈ 5 పద్ధతుల్లో ఉపయోగించాలి

తాజా వార్తలు