ఏపీ సీఎస్ ను తొలగించాలని సీఈసీకి టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ లేఖ..!!

తెలుగుదేశం పార్టీ నేత కనకమేడల రవీంద్ర కుమార్( Kanakamedala Ravindra Kumar ) కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు లేఖ రాశారు.

సిఎస్ జవహర్ రెడ్డిని( CS Jawahar Reddy ) తొలగించి ఆయనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

పెద్ద ఎత్తున ప్రభుత్వ అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని జవహర్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు.తన కుమారుడు మరియు బినామీల పేరిట సీఎస్ భూములు కొన్నారని వివరించారు.

ఆ విధంగా సీఎస్ ఎనిమిది వందల ఎకరాలు కొనుగోలు చేశారని లేఖలో కనకమేడల స్పష్టం చేశారు.ఇప్పుడు ఆ భూముల రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రభావితం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Tdp Leader Kanakamedala Ravindra Kumar Letter To Cec To Remove Ap Cs Details, T

అంతేకాకుండా అధికార యంత్రాంగాన్ని తన అధికారులను దుర్వినియోగం చేశారని తెలిపారు.ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆరోపించారు.ఈ పరిస్థితులలో కౌంటింగ్ సజావుగా జరుగుతుందా.? అంటూ అనుమానం వ్యక్తం చేశారు.సిఎస్ జవహర్ రెడ్డిని తొలగించి సిబిఐ విచారణకు( CBI Enquiry ) ఆదేశాలు జారీ చేయాలని సీఈసీని కనకమేడల లేఖలో కోరడం జరిగింది.

Advertisement
TDP Leader Kanakamedala Ravindra Kumar Letter To CEC To Remove AP CS Details, T

జూన్ 4వ తారీఖు ఓట్ల లెక్కింపు( Votes Counting ) ప్రక్రియ మొదలుకానుంది.పోలింగ్ అనంతరం చాలాచోట్ల హింసాత్మకమైన ఘటనలు చోటుచేసుకున్నాయి.దీంతో ఓట్ల లెక్కింపు విషయంలో ప్రధాన పార్టీలు.

పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి( CEC ) లేఖలు రాస్తున్నాయి.తాజాగా తెలుగుదేశం నాయకులు సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారంపై సీఈసీకి లేఖ రాయడం సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు