జూనియర్ ఎన్టీఆర్ ను మళ్ళీ మళ్ళీ ఎందుకు లాగుతారయ్యా ? 

ప్రస్తుతం రాజకీయాలతో సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరిస్తూ.సినిమాల్లోనే బిజీగా గడుపుతూ,  ప్రస్తుతం తన సినీ కెరియర్ పైనే దృష్టి సారించారు జూనియర్ ఎన్టీఆర్.

( Jr NTR ) గతంలో టిడిపి తరఫున ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నా,  ఆ తరువాత పూర్తిగా రాజకీయాలకు దూరం అయ్యారు.అయినా ఏపీ రాజకీయాల్లో పదేపదే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వస్తూనే ఉంది.

ఒకవైపు వైసీపీ, ( YCP ) మరోవైపు టిడిపి,( TDP ) ఏదో ఒక అంశంలో ఆయన పేరును ప్రస్తావిస్తూ రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.టిడిపికి వ్యతిరేకంగా వైసిపి గతంలో అనేకసార్లు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడం , టిడిపి సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, తదితర వ్యవహారాలకు పాల్పడ్డాయి.

వైసిపి ప్రత్యక్షంగాను , పరోక్షంగాను జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడం, టిడిపికి రాజకీయంగా ఇబ్బంది కలిగించాయి.ఏపీ రాజకీయాల్లో పదే పదే తన ప్రస్తావన వచ్చినా, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బహిరంగంగా ఎప్పుడు స్పందించలేదు.

Advertisement

టిడిపి నేతలు కొంతమంది అనేక సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు చేసినా,  ఆయన ఎప్పుడూ వాటిని ఖండించే ప్రయత్నం చేయలేదు.కూకట్ పల్లి నియోజకవర్గం లో తన సోదరి పోటీ చేసినా,  ఎన్నికల ప్రచారానికి సైతం జూనియర్ ఎన్టీఆర్ దూరంగానే ఉన్నారు.

ఈ విధంగా తన కెరియర్ పై మాత్రమే ఎన్టీఆర్ దృష్టి పెట్టినా,  టీడీపీ కి చెందిన కొంతమంది నేతలు ఎన్టీఆర్ ను వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు.నిన్న ఉదయమే టీడీపీ నేత బుద్దా వెంకన్న( Buddha Venkanna ) నారా లోకేష్ కు( Nara Lokesh ) టిడిపి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని, ఇది రిక్వెస్ట్ కాదు అని డిమాండ్ అంటూ సంచలన ప్రకటన చేశారు.  ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని బుద్ధ వెంకన్న ప్రస్తావించారు.

అసలు టిడిపికి జూనియర్ ఎన్టీఆర్ కు ఏం సంబంధం అని బుద్ధ వెంకన్న ప్రశ్నించారు.వెంకన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.కొంతమంది టిడిపి నేతలు , ఎన్టీఆర్ అభిమానులు బుద్ధ వెంకన్న వ్యాఖ్యల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై విమర్శలు చేయగా,  మరి కొంతమంది  ఆ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

చాలా ఏళ్ళు గా టిడిపికి సంబంధం లేదన్నట్లుగానే జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారని,  ఇప్పుడు వెంకన్న చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నారు .అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువచ్చి,  ఆయనపై విమర్శ చేయడం అంతిమంగా టిడిపికే ఎక్కువ నష్టం చేకూరుస్తుంది తప్ప,  లాభం ఏమి ఉండదు.  ఈ విషయాన్ని గ్రహించకుండానే పదేపదే జూనియర్ ఎన్టీఆర్ ను విమర్శించే విధంగా టిడిపి నాయకులు ప్రవరిస్తున్న తీరు,  చేస్తున్న కామెంట్స్ తిరిగి ఆ పార్టీకి డామేజ్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు