వైసీపీ మంత్రులకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న సవాల్

వైసీపీ మంత్రులకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు.బీసీలకు ఎవరేం చేశారో బహిరంగ చర్చలోనే తేల్చుకుందామని ఛాలెంజ్ చేశారు.

అవినీతి మంత్రులకు టీడీపీ కార్యాలయంలో అడుగుపెట్టే అర్హత లేదని చెప్పారు.వైసీపీ కార్యాలయంలోనే బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు.

బీసీల బతుకులను జగన్ చట్ట బద్ధంగా నాశనం చేశారని ఆరోపించారు.బీసీల జీవితాలను జగన్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన మంత్రులను తరిమి కొట్టాలని వెల్లడించారు.

బీసీలను చంద్రబాబుకు దూరం చేయాలనే కుట్రతోనే వైసీపీ బీసీ సభ పెట్టిందని విమర్శించారు.వైసీపీ జయహో బీసీ సభ అట్టర్ ప్లాప్ అని బుద్దా వెంకన్న వ్యాఖ్యనించారు.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)