తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ( Former minister Bandaru Satyanarayanamurthy )రాజకీయాలకు వీడ్కోలు పలికారు.
విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ప్రకటన చేశారు.
తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పిన బండారు సత్యనారాయణ రాజకీయంగా ఇదే తన చివరి సమావేశం అని స్పష్టం చేశారు.ఇదే సమయంలో సాటి కార్యకర్తలకు అండగా నిలబడతానని పేర్కొన్నారు.
శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు.టికెట్టు రాకపోవడం తనకి ఎంతగానో బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ( Telugu Desam Party )స్థాపించినప్పటి నుంచి.పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని తాను ఏం పాపం చేశానని టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు.పార్టీలు మారిన నేతలకు టికెట్ కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను పోటీ చేయకుండా కొందరు నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు.గత 26 రోజులుగా తనకు నిద్ర లేదని తెలిపారు.
తనపై జగన్( jagan ) ప్రభుత్వం 11 కేసులు పెట్టిన భయపడలేదని ప్రభుత్వంపై పోరాటం చేశానని స్పష్టం చేశారు.తనకు పదవులు ముఖ్యం కాదని వ్యాఖ్యానించారు.
రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలో బండారు సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేయటం సంచలనంగా మారింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy