జూనియర్ ను ప్రశ్నించే దమ్ముందా ? అయితే ముందు ఈ సమాధానాలు చెప్పండి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అరెస్ట్ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

ఇది కేవలం జగన్ చంద్రబాబుని దెబ్బతీయడానికి పన్నిన పన్నాగం అని ఆరోపిస్తున్నారు తెలుగుదేశం నాయకులు.

ఇదిలా ఉంటె, చంద్రబాబు ఫాన్స్ మాత్రం, తమ కోపం ఎవరిపై చూపించాలో తెలియక, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వైపు తిరిగారు.ఒక కుటుంబ సభ్యుడు, పార్టీ నాయకుడు అరెస్ట్ అయితే, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని తారక్ ను ఆడిపోసుకుంటున్నారు చంద్రబాబు అభిమానులు.

జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )కు చంద్రబాబు మీద కృతజ్ఞతాభావం లేదని, రాష్ట్రంలో ఇంత అల్లకల్లోము జరుగుతుంటే పట్టించుకోకుండా హాలిడే ఎంజాయ్ చెయ్యడానికి దుబాయ్ వెళ్లిపోయాడని అంటూ పబ్లిక్ గా ఆయన పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సినవి రెండు విషయాలు.ఒకటి, అసలు తారక్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఎందుకు స్పందించాలి? చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ అతని తాతగారిదే అయినప్పటికీ, తారక్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా, తన పని తానూ చేసుకుంటూ పోతున్నాడు.కనుక రాజకీయపరంగా రాష్ట్రంలో జరిగే సంఘటనలకు ఆయన స్పందించాల్సిన అవసరం లేదు.

Advertisement

ఇప్పటివరకు సినీ పరిశ్రమ నుంచి చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన వాళ్ళు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, అశ్విని దత్ మాత్రమే.బాలకృష్ణ, చంద్రబాబు కి వియ్యంకుడు.

ఆ పార్టీలో సిట్టింగ్ ఏంఎల్ఏ.కనుక ఆయన స్పందించి తీరాలి.

పవన్ కళ్యాణ్ కూడా స్పందించింది కేవలం రాజకీయ లబ్ది పొందడం కోసమే.పవన్ కు రాబోయే ఎలెక్షన్ లో తెలుగు దేశం పార్టీ సపోర్ట్ అవసరం.ఇకపోతే అశ్విని దత్ స్పందించడానికి కారణం, అమరావతి భూములు.

ఇలా స్పందించిన ప్రతి ఒక్కరు తమ స్వార్ధం కోసం మాత్రమే స్పందించారు.మరి ఇందులో జూనియర్ చేసిన తప్పేమిటో అర్ధం కావటం లేదు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

ఇక రెండో ప్రశ్న, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు పట్ల కృతాజ్ఞతతో ఉండాలా? నందమూరి తారకక్ రామారావు ( Nandamuri Tarakak Rama Rao )కుమారుడు హరి కృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్.అయినప్పటికీ నందమూరి కుటుంబం అతన్ని చాలాకాలం దూరం పెట్టింది.బాలకృష్ణ కు ఇప్పటికి తారక్ అంటే చిన్న చూపే.

Advertisement

కానీ పెద్దాయన వాక్చాతుర్యం, పోలికలతో ఎన్టీఆర్ నటవారసుడిగా జూనియర్ ఎదిగిన తీరు చూసి చంద్రబాబు ముందే జాగ్రత్త పడ్డాడు.అందుకే పనికొస్తాడులే అని అతన్ని హరి కృష్ణ కొడుకుగా అంగీకరించాడు.

ఐతే చంద్రబాబు చేసిన ఈ సాయానికి జూనియర్ రుణం తీర్చుకున్నాడనే చెప్పాలి.అప్పట్లో చంద్రబాబు కోసం రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసాడు.

ఆక్సిడెంట్ కి కూడా గురయ్యాడు.అయినా సరే హాస్పిటల్ బెడ్డు పై నుంచి "సైకిల్ గుర్తుకి ఓటు వెయ్యండి" అంటూ గొంతెత్తి అరిచాడు.

ఇంత చేసిన తారక్ ను తన కొడుకు భవిష్యత్తు కోసం పక్కన పడేసాడు చంద్రబాబు.చంద్రబాబు బుద్ధిని గ్రహించి దూరంగా ఉండడం ప్రారంభించాడు.

మిగతా కుటుంబం తో పెద్దగా సంబంధం లేకుండా అన్న కళ్యాణ్ రామ్( Kalyan Ram ) తో కలిసి మెలిసి ఉంటూ, తన కెరీర్ పై ఫోకస్ చేస్తున్నాడు.గతాన్ని మర్చిపోయి ఒకవేళ జూనియర్ చంద్రబాబు కోసమో, లేదా పార్టీ కోసమో పోరాడి ఇబ్బందుల్లో పడితే, ఆ కుటుంబం అతనికి అండగా నిలుస్తుందనే ఆలోచన వట్టి బూటకమే.

ఇవన్నీ ఆలోచిస్తే, ఇప్పుడు జూనియర్ చేస్తున్నది కరెక్టే అనిపిస్తుంది.

తాజా వార్తలు