కరోనా లోనూ రాజకీయమే కావాలా ? 

అక్కడ లేదు ఇక్కడ లేదు అనే మాట లేకుండా ప్రపంచం మొత్తం కరోనా అలుముకుంది.ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

ప్రతి ఒక్కరిలోనూ కరోనా భయమే కనిపిస్తోంది.ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయం అలుముకుంది.

ఇక భారత్ లో అయితే ఆ సంగతి చెప్పనవసరం లేదు.నిత్యం నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతూనే వస్తున్నాయి.

ప్రపంచంలో ఇప్పుడు భారత్ నెంబర్ వన్ స్థానానికి చేరిపోయింది.కేంద్రం సైతం పూర్తిగా కరోనా కట్టడి, వ్యాక్సిన్, లాక్ డౌన్ ఇలా అన్ని విషయాలను ఆయా రాష్ట్రాలకు వదిలిపెట్టింది.

Advertisement
TDP Criticizing Without Giving Hints To The Corona Building, Achhenna, AP, Car

దీంతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి.ఇక ఏపీ విషయానికి వస్తే నిత్యం 20 వేల కేసులు ఏపీలో నమోదవుతున్నాయి.

కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూనే , లాక్ డౌన్ విధించకుండా, జనాలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అమలు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో జగన్ ముందుగానే ఊహించడం తో ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనాతో జనాలు విలవిల్లాడుతున్నారు.దేశవ్యాప్తంగా కొరత ఉన్నట్లే ఏపీలోనూ ఆక్సిజన్ కొరత వేధిస్తోంది.

ఈ సమయంలో అధికార పార్టీకి తగిన సలహాలు సూచనలు ఇస్తూ,  కరోనా కట్టడికి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష పార్టీలు ఈ కరోనా కాలంలోనూ, తమకు రాజకీయమే ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

Tdp Criticizing Without Giving Hints To The Corona Building, Achhenna, Ap, Car

అర్జెంటుగా జగన్ సీఎం కుర్చీలో నుంచి దిగిపోవాలని, ఆయనకు పరిపాలన అనుభవం లేదని పదే పదే టిడిపి విమర్శలు చేస్తోంది.అంతేకాదు చంద్రబాబుకు వారం రోజులు సీఎం కుర్చీ అప్పగిస్తే మొత్తం కంట్రోల్ లో పెట్టేస్తారు అంటూ  టిడిపి నాయకులు మాట్లాడుతూ, అసలే కరోనా భయంతో ఆందోళనలో ఉన్న ప్రజలను తమ మాటలతో మరింత భయపెట్టే విధంగానూ ,  ఏపీలో మాత్రమే ఈ కరోనా విలయ తాండవం చేస్తుంది అన్నట్లుగా జగన్ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు.చంద్రబాబు, లోకేష్ లు మొదలుకొని టిడిపి నాయకులు అంతా ఇప్పుడు కరోనా ను తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటునే అధికార పార్టీ పై విమర్శనాస్త్రాలు గురి పెడుతున్నారు.

Advertisement

కరోనా విలయతాండవం కంటే రాజకీయ మహమ్మారే ఇప్పుడు ఏపీకి పెద్ద శాపంగా మారింది.

తాజా వార్తలు