ఏపీలో మరో వినూత్న నిరసనకు టీడీపీ పిలుపు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ పార్టీ మరో వినూత్న నిరసన చేపట్టనుంది.

ఈ మేరకు ‘జగనాసుర దహనం’ పేరుతో నిరసనకు ఆ పార్టీ నేత నారా లోకేశ్ పిలుపునిచ్చారు.

రావణాసుర దహనం తరహాలో జగనాసుర దహనం చేయాలని లోకేశ్ కోరారు.దహనం వీడియో, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలన్నారు.

చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా ఈ దసరా పండుగను చేసుకుందామని లోకేశ్ తెలిపారు.ఏపీలో జగన్ అరాచక పాలన అంతం కావాలంటూ ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల మధ్య ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి దహన కార్యక్రమం చేయాలని సూచించారు.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు