జనసేనతో వీజీ కాదు అంటున్న తెలుగు తమ్ముళ్లు!

అధినేతల స్థాయిలో పొత్తు ప్రకటించడం సులభంగానే జరిగిపోయినా పార్టీ క్యాడర్ సమన్వయం మాత్రం జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తుకు ప్రధాన అడ్డంకిగా మారినట్లుగా తెలుస్తుంది.ముఖ్యంగా ఈ రెండు పార్టీలను బలపరుస్తున్న రెండు సామాజిక వర్గాలకు సహజంగానే కొంత ఘర్షణాత్మక చరిత్ర ఉంది, అంతేకాకుండా ఇప్పుడు సీట్ల సర్దుబాటులో తమకు పోటీ వస్తున్న నేతలతో ఎలా సర్దుకుపోవాలో తెలుగు తమ్ముళ్లకు నిజంగానే అర్థం కావడం లేదట , నిజానికి టిడిపికి పొత్తులు ఎప్పుడూ కొత్త కాదు, అనేక చిన్న పార్టీలతో పొత్తులను విజయవంతంగా నెరిపిన చరిత్ర ఆ పార్టీకి ఉంది.

Tdp Cadre Not Comfortable With Janasena , Tdp , Janasena, Ap Politics , Andhr

నిజానికి పోత్తులతో తప్ప సింగిల్ గా చంద్రబాబు( Chandrababu naidu ) గెలవలేరని కూడా అంటూ ఉంటారు.అయితే ఈసారి మాత్రం జనసేన ( Janasena )తో పొత్తు కొత్త అనుభవాలను తెలుగు తమ్ముళ్లకు పరిచయం చేస్తున్నట్లుగా ఉంది.తమను మైనర్ భాగస్వామి గా గుర్తించడానికి సుతరామం ఇష్టపడని జనసైనికులు అన్నింటా తగిన గౌరవం అంటూ మెలిక పెడుతూ ఉండటం తెలుగు తమ్ముళ్లను కలవర పడుతుందట .

Tdp Cadre Not Comfortable With Janasena , Tdp , Janasena, Ap Politics , Andhr
Tdp Cadre Not Comfortable With Janasena? , Tdp , Janasena, Ap Politics , Andhr

ముఖ్యంగా సీట్ల కేటాయింపుపై తమదైన శైలిలో ప్రకటనలు చేస్తున్న జనసైనికులు కనీసం 60 నుంచి 70 స్థానాలు జనసేనకు కేటాయిస్తారని చెబుతూ ఉండడం , రెండు సంవత్సరాలు అధికారంలో వాటా ఇస్తారని మీడియాలో ప్రచారం జరుగుతూ ఉండడంతో పొత్తుపై తెలుగు తమ్ముళ్లలో అయోమయం నెలకొన్నట్లుగా తెలుస్తుంది.నిజానికి సీట్ల సంఖ్యలో కాస్త తక్కువ ఇచ్చినా అధికారంలో వాటా ఇస్తామనే మాట తెలుగుదేశం( TDP ) అధిష్టానం నుంచి వచ్చి ఉండుంటే ఇప్పటికే అన్ని సమీకరణాలు సెట్ అయి ఉండేవి.కానీ అధినేతల మధ్య కుదిరిన అవగాహన ఏమిటో తెలియదు గాని చివరి వరకు గుప్పిట మూసే ఉంచాలన్న రీతిలో ఇద్దరు అధినేతలు ముందుకు వెళ్తున్నారు .దాంతో భవిష్యత్తుపై స్పష్టత లేని కార్యకర్తలు కు సమన్వయం కష్టం గానే ఉన్నట్లు తెలుస్తుంది.మరి కార్యకర్తల పరిస్థితి అర్థం చేసుకోనైనా కీలకమైన విషయాలు పై రెండు పార్టీలు క్లారిటీ ఇస్తే తప్ప ఈ సమన్వయం ముందుకు కదిలేలా కనిపించడం లేదు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు