ఎమ్యెల్యేగా పోటీ చేసిన వ్యక్తిపై టీడీపీ బహిష్కరణ వేటు

తెలుగుదేశం పార్టీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన ఓ నాయకుడి పై ఇప్పుడు టీడీపీ బహిష్కరణ వేటు వేసింది.

వివరాలు పరిశీలిస్తే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా పి.

గన్నవరం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన నేలపూడి స్టాలిన్ బాబు అనే వ్యక్తిపై బహిష్కరణ వేటు వేస్తూ నియోజకవర్గ స్థాయి సమావేశం తీర్మానం చేయడం దానిని వెంటనే పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆమోదించడం వెంట వెంటనే జరిగిపోవడం ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతోంది.ఎన్నికల సమయంలో పార్టీ అధిష్ఠానం పంపించిన పార్టీ ఫండ్‌ దుర్వినియోగమైందన్న ఆరోపణలు నేపథ్యంలో సోమవారం లంకల గన్నవరంలో సమావేశం నిర్వహించారు.

ఆ సందర్భంగా ఇప్పటి వరకు ఎక్కడా జరగని రీతిలో పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన వ్యక్తినే ఆ పార్టీ కేడర్‌ బహిష్కరిస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడం దానికి వెంటనే జిల్లా అధ్యక్షుడు ఆ తీర్మానానికి ఆమోదముద్ర వేయడం వెంటవెంటనే జరిగిపోయాయి.ఎన్నికల నాటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్న స్టాలిన్‌బాబుకు ఈ విషయంపై సమాచారం అందడంతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

అంబాజీపేటకు చెందిన నేలపూడి స్టాలిన్‌బాబు గతంలో అప్పటి టీడీపీ ఎంపీగా పనిచేసిన పండుల రవీంద్రబాబు వద్ద పీఆర్‌వోగా పనిచేసిన వ్యక్తి.ఎన్నికల సమయంలో పార్టీ అధిష్ఠానం ఇచ్చిన పార్టీ ఫండ్‌ దుర్వినియోగమైందనే ఆభి యోగాలపై పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు వద్ద నియోజకవర్గ నాయకులు పంచాయితీ పెట్టారు.దీనిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఆయనపై ఆరోపణలు రుజువు కావడంతో వెంటనే బహిష్కరణ వేటు వేశారు.అయితే దీనిపై స్టాలిన్ బాబు కూడా స్పందించారు.

పార్టీలో కొంతమంది కావాలని కుట్ర పన్నారని ఎన్నికల్లో ప్రత్యర్థులతో కలిసి నన్ను ఓడించి ఇప్పుడు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.తాను ఈ నెల 10 వ తేదీనే పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు