టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కామెంట్స్.
భారతదేశ స్వాతంత్రం కోసం గాంధీ గారితో పాటు నెహ్రు గారు 16 సంవత్సరాలు మరియు ఇందిరగాంధీ గారు 6 సంవత్సరాలు దేశ ప్రజల కోసం జైలు జీవితం గడిపిన కుటుంబం గాంధీ కుటుంబానిది.
స్వాతంత్ర ఉద్యమ సమయంలో బీజేపీ పార్టీ యే లేదు అప్పుడు మోడీ, అమిత్ షా పుట్టనే లేదు ఆర్ ఎస్ ఎస్ పాత్ర లేనే లేదు.ఇంత పెద్ద ప్రజాస్వామ్యాన్ని తీసుకొని రావాలని పోరాటం చేసిన సోనియా గాంధీ,రాహుల్ గాంధీ కుటుంబం పైన నేషనల్ హెరాల్డ్ పేపర్ లో అవకతవకలు చేశారనే అభియోగం పెట్టి కేసులు పెడతారా.
ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఇందిరగాంధీ, రాజీవ్ గాంధీ పై చట్టలో కొంత లొసుగులను వెతికి తీసి ఒక రాజకీయ హత్య చేసే ప్రయత్నం బీజేపీ - ఆర్ ఎస్ ఎస్ చేస్తుంది.బీజేపీ -ఆర్ ఎస్ ఎస్ నాయకులు పెద్ద అవినీతి పరులు, పెద్ద క్రిమినల్స్.
మోడీ, అమిత్ షా లు ఒక పెద్ద క్రిమినల్స్.చేయని తప్పుని చేసిన్నట్లు బీజేపీ చూపిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పిదాలను సోనియా, రాహుల్ గాంధీ ఎత్తి చూపిస్తున్నారనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది.సోనియా,రాహుల్ గాంధీ గారు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని బీజేపీ భయపడుతుంది.
రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారు దేశంలో పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు.రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే మోడీ పేద వారికి ఇస్తానన్న 15 లక్షలు ఏమైయ్యాయని నిలదిస్తారు.
ప్రభుత్వ ఆస్తులను అంబానీ,ఆదాని లకు అమ్మేస్తుంటే సోనియా,రాహుల్ గాంధీ గారు నిలదీస్తున్నారు.ఇవ్వని నిలదియొద్దు అంటే ఎదో ఒక వంక తో సోనియా,రాహుల్ గాంధీ గారిని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవాలి.
అందుకే బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ కుట్రపూరితంగా ఈడీ పేరుతో సోనియా,రాహుల్ గాంధీ గారిని ఇబ్బందిపెడుతున్నారు.
ఇలా బీజేపీ - ఆర్ ఎస్ ఎస్ వ్యూహాత్మకంగా రాజకీయ కుట్ర చేస్తుంది.సోనియా, రాహుల్ గాంధీ లను ప్రజల నుండి దూరం చేయాలని ఈడీ చుట్టూ తిప్పితే ప్రజల దగ్గరికి వెళ్ళకుండా ఉంటారని ఇలాంటి కుట్రలకు పాల్పడుతుంది.అధికార యంత్రంగాని రాజకీయంగా వాడుకుంటూ ఈ రకంగా సోనియా,రాహుల్ గాంధీ కుటుంబాన్ని అప్రదిష్టపాలు చేయాలని చూస్తుంది.
బీజేపీ- ఆర్ ఎస్ ఎస్ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి,మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇలాంటి కుట్రలు చేస్తుంది.బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం సోనియా, రాహుల్ గాంధీ కుటుంబని రాజకీయంగా హత్య చేసే ప్రయత్నం చేస్తోంది.
మా నాయకులకు అండగా ఉంటాం.ఎన్ని సార్లు ఈడీ పిలిస్తే అన్ని సార్లు నిరసన తెలుపుతాం.
ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేస్తాం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy