‘ట్యాక్సీవాలా’ కలెక్షన్స్‌.. మరో గీత గోవిందం

విజయ్‌ దేవరకొండ తన సత్తాను మరోసారి చాటాడు.‘ట్యాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన మొదటి రోజే సినిమాకు పెట్టిన పెట్టుబడిని రాబట్టేశాడు.

సినిమా విడుదలకు ముందు నెగటివ్‌ ప్రచారం జరిగింది, సినిమా ముందే పైరసీ అయ్యింది.అయినా కూడా మొదటి రోజు దాదాపుగా 10 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసి స్టార్‌ అనిపించుకున్నాడు.

మొదటి రోజు అయిదు కోట్ల షేర్‌ను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ రెండవ రోజు కూడా అదే స్థాయిలో వసూళ్లను రాబడుతూ దూసుకు పోతున్నాడు.ఓవర్సీస్‌లో ఈ చిత్రం మిలియన్‌ మార్క్‌ను చేరుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

గీత గోవిందం చిత్రం కూడా ఇలాగే మెల్ల మెల్లగా సినిమా ప్రేక్షకులకు ఎక్కి రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది.ఈ చిత్రం కూడా తప్పకుండా భారీ వసూళ్లను నమోదు చేస్తుందనే టాక్‌ వినిపిస్తోంది.

Advertisement

శని, ఆదివారాల్లో ఈ చిత్రం సాధించిన షేర్‌ : నైజాం : 2.85 కోట్లు వైజాగ్‌ : 77 లక్షలు ఈస్ట్‌ : 39 లక్షలు వెస్ట్‌ : 38 లక్షలు కృష్ణ : 51 లక్షలు గుంటూరు : 53 లక్షలు న్లెూరు : 21 లక్షలు సీడెడ్‌ : 86 లక్షలు యూఎస్‌ : 1.24 కోట్లు కర్ణాటక : 81 లక్షలు ఇతరం : 50 లక్షలు మొత్తం : 9.05 కోట్లు .

Advertisement

తాజా వార్తలు