తారక్‌కు ఇదైనా కలిసి వచ్చేనా?

నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఆరంభంలోనే సంచలనం సృష్టించాడు తారక రత్న.

ఒక్క సినిమా ఆరంభం కాకుండానే ఏడు సినిమాలకు కమిట్‌ అయ్యి రికార్డును సాధించాడు.

ఈ నందమూరి హీరోకు ఆ రికార్డు తప్ప మరే రికార్డు కూడా దక్కలేదు.ఈయన నటించిన ఏ ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు కమర్షియల్‌గా సక్సెస్‌ను అందుకోలేక పోయింది.

హీరోగా సక్సెస్‌లు రావడం లేదనే ఉద్దేశ్యంతో ఇక విలన్‌ వేశాలు వేసేందుకు సిద్దం అయ్యాడు.తాజాగా ఈయన ‘రాజా చేయి వేస్తే’ చిత్రంలో విలన్‌ పాత్రలో నటించాడు.

నారా రోహిత్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తారకరత్న విలన్‌గా కనిపించబోతున్నాడు.ఇప్పటికే విడుదలైన తారక్‌ లుక్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలుగజేస్తోంది.

Advertisement

‘అమరావతి’ తర్వాత మరో మంచి సినిమా తారక్‌కు పడబోతుందని ఆయన సన్నిహితులు సైతం అంటున్నారు.తప్పకుండా ఈ సినిమా ద్వారా తారక్‌కు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నారు.

ఇందులో సక్సెస్‌ అయితే ఈయనకు మళ్లీ హీరో ఆఫర్లు వస్తాయేమో చూడాలి.ప్రస్తుతం తారక్‌ ఆశలు అన్ని కూడా ‘రాజా చేయివేస్తే’ చిత్రంపైనే ఉన్నాయి.

మరి ఆ సినిమా తారక్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

.

దావూద్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్న స్టార్ హీరో!
Advertisement