అరగుండు తారక్ తో ఏం ప్లాన్ చేశావ్ సుకుమార్.. పుష్ప2 సరికొత్త రికార్డులు ఖాయమా?

సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప2.

( Pushpa 2 ) తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.భారీ అంచనాల విడుదలైన ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఈ సినిమా ట్రైలర్ ను చూసిన ప్రతి ఒక్కరూ కూడా మూవీ మేకర్స్ ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.

ట్రైలర్‌ లో సస్పెన్స్‌, యాక్షన్‌ తారా స్థాయిలో ఉండటమే కాకుండా, కొత్త పాత్రల పరిచయంతో ఆసక్తి రేపుతోంది.అందులో ముఖ్యంగా అరగుండు గెటప్‌ తో కనిపించిన తారక్ పొన్నప్ప( Tarak Ponnappa ) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌ గా నిలిచాడని చెప్పాలి.కేవలం కొన్ని సెకన్ల పాటు కనిపించిన తారక్ పొన్నప్ప లుక్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

Advertisement

మెడలో చెప్పుల దండ, ఇంటెన్స్ లుక్‌ తో తారక్ పాత్ర సినిమాకు కొత్త మలుపు ఇవ్వబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కన్నడ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తారక్, దేవరలోతన నెగిటివ్ రోల్ ద్వారా టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు పొందాడు.

ఇక పుష్ప 2 ట్రైలర్ ద్వారా ఈ పాత్రకు సుకుమార్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.విడుదల తర్వాత తారక్ ని చూసిన అభిమానులు అరగుండు తారక్ తో ఎలాంటి ప్లాన్ వేసావ్ సుకుమార్.సినిమా మామూలుగా ఉండదేమో అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

దానికి తోడు సినిమా ట్రైలర్ లో శ్రీవల్లి అలాగే పుష్పరాజ్ చెప్పే డైలాగులు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.మరి డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.

లిచి పండ్లలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?
Advertisement

తాజా వార్తలు