షూట్ సమయంలో తారక్ అలా బిహేవ్ చేస్తారా.. శుభలేఖ సుధాకర్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత ఐదేళ్లలో కేవలం రెండే రెండు సినిమాలలో నటించారు.

ఆ సినిమాలలో అరవింద సమేత ఒకటి కాగా ఆర్ఆర్ఆర్ మూవీ మరొకటి.

ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి.అరవింద సమేత తారక్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సినిమాకు ఏకంగా 90 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.అరవింద సమేత సినిమాలో శుభలేఖ సుధాకర్ కూడా కీలక పాత్రలో నటించారు.

ఒక ఇంటర్వ్యూలో శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ అరవింద సమేత షూట్ కు సంబంధించిన షాకింగ్ విషయాలను పంచుకున్నారు.ఓటీటీలలో కొన్ని సినిమాలు అద్భుతంగా తీస్తున్నారని ఆయన తెలిపారు.

Advertisement
Tarak Behavior While Shooting Subhaleka Sudhakar Comments Viral Details, Aravind

టాలీవుడ్ లో ఎంతోమంది గొప్ప దర్శకులు ఉన్నారని శుభలేఖ సుధాకర్ కామెంట్లు చేయడం చేశారు.

Tarak Behavior While Shooting Subhaleka Sudhakar Comments Viral Details, Aravind

జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమాతో పాటు దమ్ము సినిమాలో చేశాన్ని శుభలేఖ సుధాకర్ చెప్పుకొచ్చారు.అరవింద సమేత మూవీలో చిన్న రోల్ అయినప్పటికీ మంచి రోల్ దక్కిందని ఆయన కామెంట్లు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదని తారక్ సెట్ లో ఉన్నారంటే అల్లరిగా ఉంటుందని శుభలేఖ సుధాకర్ తెలిపారు.

తారక్ డైలాగ్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారో కూడా అర్థం కాదని ఆయన అన్నారు.

Tarak Behavior While Shooting Subhaleka Sudhakar Comments Viral Details, Aravind

నవ్వుతూనే సెట్ లో రెడీ అన్న వెంటనే షూట్ లో పాల్గొని తారక్ నటిస్తారని శుభలేఖ సుధాకర్ కామెంట్లు చేశారు.తారక్ తో చాలా సరదాగా ఉంటుందని శుభలేఖ సుధాకర్ అభిప్రాయపడ్డారు.మహేష్ బాబు కూడా సెట్ లో సరదాగా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

వకీల్ సాబ్ మూవీలో పవన్ కాంబినేషన్ సీన్ ను చేసే పాత్ర కొన్ని కారణాల వల్ల పోయిందని ఆ సినిమాలో హౌస్ ఓనర్ గా కనిపించానని శుభలేఖ సుధాకర్ కామెంట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు