'తానా'... సెక్రటరీ, ట్రెజరర్‌, జాయింట్‌ సెక్రటరీలుగా..!!!

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో అతిపెద్ద సంఘంగా పేరొందిన తానా సంఘం 2019-21 సంవత్సరానికి గాను తానాలో కొన్ని కీలక పదవులని భర్తీ చేసింది.

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నికల్లో ఉత్త అమెరికా తెలుగు సంఘం (తానా) సెక్రటరీగా రవి పొట్లూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈయన ఫిలడెల్ఫియాలో ఉంటారు.ముందు నుంచీ తానాలో వివిధ పదవులని చేపడుతూ వచ్చారు.

అలాగే ఇవే ఎన్నికల్లో కాలిఫోర్నియా కి చెందినా వెంకట్ కోగంటి ని జాయింట్ ట్రెజరర్ గా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఆయన ఒకరే ఈ పోస్టుకు నామినేషన్‌ దాఖలు చేయడంతో.పోటీ దారులు ఎవరూ లేక ఆయన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

అదేవిధంగా ఒహాయో రాష్ట్రానికి చెందిన అశోక్‌బాబు కొల్లాని తానా జాయింట్‌ సెక్రటరీగా ఎంపిక చేశారు.అయితే అశోక్ బాబు ఎంపిక కూడా ఏకగ్రీవంగా జరగడం గమనార్హం.ఇలా ముగ్గురు అభ్యర్ధులు ఏక కాలంలో ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు.

Advertisement

తానా అభివృద్దికి , తానా ద్వారా జరగబోయే సేవా కార్యక్రమాలని ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తామని వారు తెలిపారు.

3 Attachments .

Advertisement

తాజా వార్తలు