కేంద్రానికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ..!!

మిగ్ జామ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా తమిళనాడు అతలాకుతలం అయింది.చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.

భారీ వానల కారణంగా తమిళనాడు తీవ్రంగా నష్టపోయింది.ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రానికి లేఖ రాశారు.రిలీఫ్ ఫండ్ కింద రూ.5,060 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖలో విన్నవించారు.అలాగే రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు గానూ కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు.

కాగా మిగ్ జామ్ తుపాను ప్రభావంతో ఏపీ, తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు