Thalapathy Vijay : ఈ అవతారం ఏంటి విజయ్ అంటున్న అభిమానులు.. అస్సలు చూడలేకపోతున్నామంటూ?

తమిళ సూపర్ స్టార్‌ విజయ్<( Thalapathy Vijay )/em> ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో గోట్‌ సినిమా( Goat Movie )ను చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా షూటింగ్ నిమిత్తం తిరువనంతపురం కి విజయ్ వెళ్లాడు.

అక్కడ ఫ్యాన్స్, ప్రేక్షకులు విజయ్‌ కి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.అంతవరకు బాగానే ఉన్నా తిరువనంతపురం షూటింగ్ కు వెళ్లిన విజయ్ లుక్( Hero Vijay Look ) ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

పెద్ద జుట్టు, మీసాలు గడ్డం లేకుండా కనిపించాడు.చాలా మంది ఈ లుక్ చూసి షాక్ అవుతున్నారు.

నెటిజన్స్ ఈ లుక్ పై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు.అసలు విజయేనా లేక ఇంకెవరైనా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

స్వయంగా విజయ్ అభిమానులు కూడా బాబోయ్‌ ఏంటన్న ఈ లుక్ అన్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.

గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు విజయ్.ఇలాంటి లుక్ ను నీ నుంచి ఆశించలేదు అంటూ వారు సోషల్‌ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.ఇదే సమయంలో దర్శకుడు వెంకట్‌ ప్రభు( Director Venkat Prabhu ) పై వారు విమర్శలు చేస్తున్నారు.

కొంతమంది అయితే చాలా చండాలంగా ఉన్నారు ఇదంతా కూడా మేకప్ మహిమనేమో అంటూ కామెంట్ చేస్తున్నారు.విజయ్ నేచురల్‌ లుక్ ను చెడగొట్టి ఇలా దరిద్రంగా మార్చావు.

ఈ సినిమాను జనాలు కాదు కనీసం ఫ్యాన్స్ అందరూ అయినా చూసే పరిస్థితి ఉంటుందా అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.గోట్‌ సినిమాలో విజయ్ ను రెండు విభిన్నమైన పాత్రల్లో( Dual Roles ) దర్శకుడు వెంకట్‌ ప్రభు చూపించబోతున్నాడు.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

రెండు పాత్రల్లో ఒక పాత్ర ముసలి వయసులో ఉన్న విజయ్‌.ఆ పాత్ర కోసం ఇలా లుక్ ను విజయ్ మార్చి ఉంటాడు అనేది తమిళ మీడియా వర్గాల్లో టాక్‌.రాజకీయాల్లోకి( Politics ) రాబోతున్నట్లుగా ప్రకటించిన విజయ్‌ చివరగా చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

Advertisement

అలాంటి సినిమాకు ఇలాంటి లుక్ ఏంటో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.అయితే జస్ట్ కేవలం ఆ లుక్ లో కనిపించేసరికి తట్టుకోలేకపోతున్న అభిమానులు, సినిమాలో అలాంటి పాత్రలో విజయం చూసి తట్టుకుంటారా లేదా జీర్ణించుకుంటారో లేదో చూడాలి మరి.

తాజా వార్తలు